IMDB Popular Movies 2024: IMDB ప్రకారం ‘ఇండియన్ మోస్ట్ పాపులర్ సినిమాలు 2024’ లిస్ట్ లో మొదటి ప్లేస్ ను దక్కించుకున్న సినిమా ఏంటో తెలుసా..?

నార్త్, సౌత్ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా సినిమా మొత్తం ఒక్కటే అయిపోయింది. అందుకే ప్రతి సినిమాను అన్ని భాషల ప్రేక్షకులు చూస్తున్నారు. వాళ్ళకి నచ్చితే ఆదరిస్తున్నారు. లేదంటే రిజక్ట్ చేస్తున్నారు...

Written By: Gopi, Updated On : July 24, 2024 8:01 am

IMDB Popular Movies 2024

Follow us on

IMDB Popular Movies 2024: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. ఇక అందుకోసమే సినిమా ఏదైనా కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆ సినిమాలను చూసి బావుందా బాలేదా అనే విషయాలను కూడా తెలియజేస్తున్నారు. నిజానికి ఒక సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటే ఆ సినిమాలో చాలా ముఖ్యమైన ఎలిమెంట్స్ అనేవి ఉండాలి. ఇక ముఖ్యంగా ఒక సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది అంటే ఆ సినిమాలో ఉన్న అన్ని క్రాప్ట్స్ వారు వాళ్ల పనిని సరిగ్గా చేశారని మనం భావించాలి. అంతే తప్ప ఏ ఒక్కరి వల్లనో సినిమా అనేది సూపర్ సక్సెస్ అవ్వదు…ఇక ఇదిలా ఉంటే ఈ సంవత్సరం రిలీజ్ అయిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే కొన్ని సినిమాలు డిజాస్టర్లుగా కూడా మిగిలాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ‘ఇండియన్ మోస్ట్ పాపులర్ సినిమాలు’ ఏంటి అనేది IMDB ఒక రిపోర్ట్ ని తయారు చేసింది. అందులో ఏ సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఏ సినిమాలు టాప్ రేంజ్ లో నిలిచియానే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఇక IMDB రిలీజ్ చేసిన సినిమాల లిస్టులో మొదటి ప్లేస్ ని ‘కల్కి ‘ సినిమా సంపాదించుకుంది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో కల్కి సినిమా ఒకటి…ముఖ్యంగా ఈ సినిమా పురాణాలను బేస్ చేసుకొని తీయడం అందులోను ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించడం వల్ల మొదటి నుంచి కూడా సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది..

కాబట్టి ఈ సినిమా నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకుంటుందనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక దానికి తోడుగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమాను చాలా అద్భుతంగా మలిచాడు. ఇక ఈ సినిమా IMDB లో 7.7 రేటింగ్ ను దక్కించుకుంది.ఇక ఆ తర్వాత ప్లేస్ లో మంజుమ్మల్ బాయ్స్ 8.3 రేటింగ్ ను దక్కించుకుంది…అలాగే నెంబర్ త్రి లో ఫైటర్ 6.2, నెంబర్ 4 లో హనుమాన్ 7.8, నెంబర్ 5 లో సైతాన్ 6.6, నెంబర్ 6 లో లపాటా లేడీస్ 8.5,

నెంబర్ 7 లో ఆర్టికల్ 370 7.9, నెంబర్ 8 లో ప్రేమలు 7.9, నెంబర్ 9 లో ఆవేశం 7.5, నెంబర్ 10 లో ముంజ్య 7.5 రేటింగ్ ను సంపాదించుకున్నాయి. ఇక మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలా లిస్ట్ లో కల్కి నెంబర్ 1 లో నిలవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి… వీటి తో పాటు గా ఇక మీదట రాబోయే పుష్ప 2, దేవర, వెల్కమ్ టు ద జంగిల్ సినిమాలా కోసం ప్రేక్షకులు చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నట్టుగా IMDb తెలిపింది… ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఈ సంవత్సరం సెకండ్ ఆఫ్ లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ తన సత్తా ను భారీ రేంజ్ లో చాటబోతుందనేది మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తోంది…