Adipurush First Review
Adipurush First Review: ఆదిపురుష్ మూవీని ప్రభాస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పెద్ద ఎత్తున్న ప్రమోట్ చేస్తున్నారు. ఆదిపురుష్ కోసం డైరెక్టర్ ఓమ్ రౌత్ అండ్ టీం నెలల తరబడి నిద్రలేకుండా పని చేశారంటూ కొనియాడారు. తిరుపతి వేదికగా ప్రీరిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. రామాయణగాథ కావడంతో హిందూ సెంటిమెంట్ ని కూడా వాడుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా ప్రమోట్ చేస్తున్నారు. ఆదిపురుష్ ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీట్ రామదూత హనుమంతుడికి కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రతి థియేటర్లో ఒక టికెట్ అమ్మకుండా సీటు ఖాళీగా ఉంచుతారు.
టీజర్ విమర్శలపాలైనా ట్రైలర్ పర్లేదన్న మాట వినిపిస్తోంది. అలాగే ప్రభాస్ సాలిడ్ హిట్ కొట్టి ఏడేళ్లు దాటిపోయింది. బాహుబలి 2 అనంతరం ఆయన నటించిన సాహో, రాధే శ్యామ్ నిరాశపరిచాయి. రాధే శ్యామ్ అయితే ఆల్ టైం డిజాస్టర్స్ లిస్ట్ లో చేరింది. మరి ఆదిపురుష్ ప్రభాస్ హిట్ దాహం తీర్చుతుందా..? మూవీ టాక్ ఎలా ఉంది?. ఆదిపురుష్ విడుదలకు మరో నాలుగు రోజుల సమయం ఉండగా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు ఆదిపురుష్ చిత్రంపై స్పందించారు. సినిమా ఎలా ఉందో తన అభిప్రాయం తెలియజేశారు. ఉమర్ సంధు అభిప్రాయంలో ఆదిపురుష్ మూవీ మెప్పించలేదు. ఆయన దారుణమైన రేటింగ్ ఇచ్చాడు. ఉమర్ సంధు తన ట్వీట్లో… ఆదిపురుష్ భారీ బడ్జెట్, క్యాస్ట్, విఎఫ్ఎక్స్, భారీ అంచనాల మధ్య విడుదలైంది. దురదృష్టవశాత్తు భారీ డిజాస్టర్ కూడాను. మూవీలో ఆత్మ లోపించింది. నటులు పెర్ఫార్మన్స్ దారుణం. ప్రభాస్ అయితే నటనలో శిక్షణ తీసుకుంటే బెటర్.
ఆదిపురుష్ మూవీ టార్చర్ అని చెప్పొచ్చు. ప్రభాస్, కృతి సనన్ లకు ఆదిపురుష్ మరో ప్లాప్… అని కామెంట్ చేశాడు. ఆదిపురుష్ మూవీకి ఉమర్ సంధు కేవలం 2 రేటింగ్ ఇచ్చాడు. ఆయన అభిప్రాయంలో మూవీ అట్టర్ ప్లాప్. భారీగా తెరకెక్కించిన ఈ చిత్రంలో మెప్పించే అంశాలు ఏవీ లేవని అంటున్నారు. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ తో పాటు అందరి నటన దయనీయంగా ఉండనట్లు వెల్లడించారు.
ఇక ఉమర్ సంధు రివ్యూపై అభిమానులు మండిపడుతున్నారు. ఉమర్ సంధుపై అసహాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమర్ సంధు రివ్యూలలో ప్రామాణికత తక్కువగా ఉంటుంది. అతని రేటింగ్ ని నమ్మాల్సిన అవసరం లేదంటున్నారు.
First Review #Adipurush = Torture #Prabhas & #KritiSanon Boxoffice Bad Luck continues…..
⭐️⭐️
— Umair Sandhu (@UmairSandu) June 11, 2023