https://oktelugu.com/

Salaar: సలార్ లో డిసిటి టెక్నాలజీ ని ఎందుకు వాడారో తెలుసా..?

గత సంవత్సరంలో సలార్ సినిమాతో ప్రభాస్ 900 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి తనదైన రీతిలో ఒక మంచి సక్సెస్ ను అయితే అందుకున్నాడు. ఇక ఇదే క్రమంలో సలార్ సక్సెస్ అయింది.

Written By: Gopi, Updated On : April 9, 2024 10:04 am
Salaar

Salaar

Follow us on

Salaar: ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ప్రస్తుతం ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అని చెప్పే రోజులు వచ్చాయి. ఇక అందులో భాగంగానే మన తెలుగు సినిమాలు ప్రతి సంవత్సరం పాన్ ఇండియా లో తమ సత్తా చాటుతూ భారీ కలెక్షన్స్ ను రాబట్టడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక గత సంవత్సరంలో సలార్ సినిమాతో ప్రభాస్ 900 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి తనదైన రీతిలో ఒక మంచి సక్సెస్ ను అయితే అందుకున్నాడు. ఇక ఇదే క్రమంలో సలార్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమాలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక కొత్త టెక్నాలజీని వాడినట్టుగా తెలుస్తుంది. అది ఏంటి అంటే ‘డి సి టి’ టెక్నాలజీ..డి సి టి అంటే ‘డార్క్ సెట్రిక్ థీమ్ టెక్నాలజీ’.. ఇక ఈ టెక్నాలజీని వాడడం వల్ల స్క్రీన్ మొత్తం డార్క్ గా కనిపిస్తూ రొటీన్ విజువల్స్ ని చూసే ప్రతి ఒక్కరికి చాలా కొత్తగా అనిపించే విధంగా ఉండడానికి ప్రశాంత్ నీల్ ఈ టెక్నాలజీని వాడినట్టుగా ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.

ఇక ‘క్రిస్టోఫర్ నోలన్’ ఎక్కువగా ఈ టెక్నాలజీని వాడతాడు. దీని ద్వారా చెప్పాలనుకున్న సీన్ తాలూకు ఎమోషన్ అనేది కరెక్ట్ గా కన్వే అవుతుందని అందుకే ఆయన ప్రతి సినిమాలో ఇదే టెక్నాలజీని వాడతాడు. ఇక దాని కోసమే ప్రశాంత్ నీల్ కూడా ఇలాంటి ఒక టెక్నాలజీని ఇక్కడికి తీసుకురావడం అనేది గొప్ప విషయమనే చెప్పాలి. అయితే ఈ టెక్నాలజీని సలార్ సినిమాలో వాడారు కాబట్టే ప్రతి సీన్ కూడా డార్క్ షేడ్స్ తో కనిపిస్తూ ఉంటాయి.

అయినప్పటికీ ఆ సీన్లు సగటు ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడంలో విజువల్స్ అనేవి కీలక పాత్ర వహించాయనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ టెక్నాలజీని తెలుగులో మరికొన్ని సినిమాల కోసం కూడా వాడబోతున్నట్టుగా తెలుస్తుంది..ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి లాంటి సినిమాలను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లని అందుకొని పాన్ ఇండియాలో తన సత్తా చూపించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది…