Bitthiri Sathi: వేణు స్వామిని టార్గెట్ చేసిన బిత్తిరి సత్తి.. పబ్లిక్ లో పరువు తీశాడుగా! వీడియో వైరల్

తాజాగా వేణు స్వామి ని ట్రోల్ చేస్తూ బిత్తిరి సత్తి చేసిన కామెడీ మామూలుగా లేదు. బిత్తిరి సత్తి వేణు స్వామి పరువు తీసేశాడు. ఉగాది పండుగ సందర్భంగా జీ తెలుగులో ఓ స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.

Written By: S Reddy, Updated On : April 9, 2024 11:07 am

Bitthiri Sathi

Follow us on

Bitthiri Sathi: వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి తరచుగా వార్తల్లో ఉంటున్నాడు. సినీ తారలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సెలబ్రిటీ జ్యోతిష్యుడు అయ్యాడు. కొందరు స్టార్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కాంట్రావర్సీ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. ఎవరేమనుకున్నా వేణు స్వామి చెప్పాలనుకున్నది నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. ఆయన జాతకం నిజం అవుతుందనే వాదన ఉంద

తాజాగా వేణు స్వామి ని ట్రోల్ చేస్తూ బిత్తిరి సత్తి చేసిన కామెడీ మామూలుగా లేదు. బిత్తిరి సత్తి వేణు స్వామి పరువు తీసేశాడు. ఉగాది పండుగ సందర్భంగా జీ తెలుగులో ఓ స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ షోకి నటుడు ఆలీ, హీరోయిన్ రాశి, సీరియల్ నటి కస్తూరి గెస్టులుగా హాజరయ్యారు. కాగా బిత్తిరి సత్తి కూడా షో లో పాల్గొన్నాడు. ఇక నా పేరు వేలు స్వామి అంటూ ఎంట్రీ ఇచ్చాడు.

అచ్చం వేణు స్వామి మాదిరి రెడీ అయి వచ్చాడు. వస్తూనే ఆలీని చూసి మే నెలలో ఏం జరగబోతుందో నీకు చెప్పాలి అని అంటాడు. దీంతో అసలు ఏం చెబుతాడని ఆలీ ఆసక్తిగా చూస్తుంటాడు. మే నెలలో ఎండలు ఇంకా ఎక్కువవుతాయని సత్తి చెబుతాడు. ఇక హీరోయిన్ రాశి దగ్గరకు వెళ్లి .. నేను ఇంతకు ముందే చెప్పా .. మీరు ఒక ప్రముఖ హీరో మీద చేయి చేసుకుంటారు అని అంటాడు. అలాంటిది ఏం లేదు .. నేను అలా చేయలేదని రాశి అంటుంది.

అయితే మీకొక వీడియో చూపిస్తాను అంటూ సత్తి చెబుతాడు. ఆ తర్వాత కస్తూరి జాతకం చెప్పాడు. మీరు హీరోయిన్ గా నటించిన సినిమా త్వరలో రీ రిలీజ్ అవుతుంది అని చెప్పాడు. నేను నటించిన అంత పెద్ద సూపర్ హిట్ ఏముందని కస్తూరి అంటుంది. అన్ని సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. అన్నమయ్య ఎందుకు కాకూడదు అని బిత్తిరి సత్తి ప్రశ్నించాడు. కాగా ఈ ప్రోమో వైరల్ అవుతుంది. వేణు స్వామిని ఇమిటేట్ చేస్తూ సత్తి చేసిన కామెడీకి అందరూ నవ్వేశారు…