Nagarjuna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు నందమూరి, అక్కినేని ఫ్యామిలీల మధ్య సినిమాల పరంగా మంచి పోటీ ఉండేది. మొదట్లో సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాలతో వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా స్టార్ హీరోలుగా చాలా సంవత్సరాల పాటు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీళ్లిద్దరిని రెండు కళ్ళుగా అభివర్ణిస్తూ ఉంటారు. ఇక మొత్తానికైతే తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడంలో వీళ్ళు చాలా వరకు హెల్ప్ చేశారు. ఇక వీళ్ళ తర్వాత తరంలో నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున ఇండస్ట్రీకి వచ్చాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా టాప్ హీరోలుగా ఎదిగడం విశేషం..ఇక మొత్తానికైతే నాగార్జున సాఫ్ట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నారు. నిజానికి ఆయన మొదట్లో క్లాస్ సినిమాలు చేసినప్పటికీ ఆ తర్వాత మళ్లీ మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చాడు. ఇక ఇప్పటికి కూడా ఆయన మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన వందో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ఇక అందులో భాగంగానే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ హీరోగా వస్తున్న ‘కుబేర ‘అనే సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు… మొన్నటిదాకా హీరోగా మాత్రమే నటించిన నాగార్జున ఇప్పుడు ఒక మంచి డిసిజన్ తీసుకొని వేరే హీరోల సినిమాల్లో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక దీంతో పాటుగా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందైన లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో కూడా విలన్ పాత్రలో నటిస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి…
ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం పైన క్లారిటీ లేదు గాని మొత్తానికైతే నాగార్జున తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఇప్పుడు ట్రేడ్ పండితులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 60 సంవత్సరాల పైబడిన నాగార్జున ఇప్పటికి కూడా స్టార్ హీరోగా చేస్తూ యంగ్ హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి, డ్యూయట్లు పాడుకుంటూ ఉండే సినిమాలను చేయడం ఎందుకు తన ఎంటైర్ కెరియర్ లో చేసినవన్నీ అలాంటి సినిమాలే కాబట్టి ఇప్పటికైన కొన్ని మంచి సినిమాలు, కొన్ని మంచి పాత్రలు చేస్తే బాగుంటుందంటూ చాలామంది విమర్శకులు చాలా రోజుల నుంచి నాగార్జున మీద విమర్శలైతే చేస్తున్నారు.
ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలను బట్టి చూస్తే ఆయన ఇప్పుడిప్పుడే కొన్ని మంచి సినిమాలు చేయాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది…ఇక ఇది చూసిన చాలామంది సినీ విమర్శకులు సైతం ఆయన తీసుకున్న డిసీజన్స్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు…ఇక నాగార్జున 100 వ సినిమా ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడు అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే ఆయన ఎంచుకుంటున్న సినిమా లైనప్ ఇప్పుడు చాలా బాగుంటుందనే చెప్పాలి…