https://oktelugu.com/

Pushpa 2: పుష్ప 2తో అల్లు అర్జున్ విధ్వసం… మైండ్ బ్లాక్ చేస్తున్న ట్రేడ్ వర్గాల అంచనాలు, ఇండియాలోనే ఎన్ని కోట్లు అంటే?

పుష్ప 2 తో అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇండియాలోనే ఈ క్రేజీ సీక్వెల్ వెయ్యి కోట్లకు పైగా రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 28, 2024 / 08:19 AM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్. పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ కి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలోని నటనకు గాను బన్నీ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు పుష్ప కి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 విడుదల కోసం సౌత్ టు నార్త్ ప్రేక్షకులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండగా అది వాయిదా పడింది.

    Also Read: రాజమౌళి కల్కి మూవీలో నటించడానికి అసలు కారణం ఇదా… కీలక విషయం వెలుగులోకి!

    కొన్ని అనివార్య కారణాల వల్ల పుష్ప2 రిలీజ్ డేట్ డిసెంబర్ 6 కి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇటీవల సుకుమార్ – అల్లు అర్జున్ మధ్య విభేదాలు రావడంతో సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వినిపించాయి. అవన్నీ ఫేక్ అని టీం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ లో ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే షూటింగ్ లో జాయిన్ అవుతారు అని సమాచారం.

    ఇది ఇలా ఉంటే .. పుష్ప 2 మూవీ ఒక్క ఇండియాలోనే రూ. 1000 కోట్లు వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నార్త్ లో పుష్ప 2 కచ్చితంగా రూ. 500 కోట్లు సులభంగా వసూలు చేస్తుంది అని భావిస్తున్నారు. ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 1000 కోట్లు సాధించిన సినిమాగా బాహుబలి 2 రికార్డు సృష్టించింది. ఆ రికార్డులన్నీ పుష్ప 2 బ్రేక్ చేస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    బాలీవుడ్ లో పుష్ప 2 రూ. 500 కోట్లు రాబడితే .. మిగిలిన భాషలు కలుపుకుని రూ. 1000 కోట్లు సాధించడం చాలా సులభం అని ట్రేడ్ వర్గాల భావన. పుష్ప 2 నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, పాటలు బాగా ఆకట్టుకున్నాయి. పుష్ప 2 టీజర్ మాత్రం బన్నీ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఆ తర్వాత రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్, కపుల్ సాంగ్ ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి.ముఖ్యంగా ‘ సూసేకి ‘ పాటకి సోషల్ మీడియా సెలెబ్రెటీలు రీల్స్ చేస్తూ సాంగ్ ని వైరల్ చేస్తున్నారు.

    అయితే పుష్ప 2 కి కొనసాగింపుగా పార్ట్ 3 కూడా ఉంటుందని సుకుమార్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్, పుష్ప ది రోర్ ఇలా మూడు భాగాలు ఉంటాయి అని సమాచారం. పార్ట్ 1 లో పుష్ప ఎలా ఎదిగాడు. పార్ట్ 2 లో పుష్ప తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు. ఇక పార్ట్ 3 లో పుష్ప తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎలా యుద్ధం చేశాడు అనే దాంతో సినిమా ముగించనున్నారట సుకుమార్.

    ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఆ మధ్య బాగా వైరల్ అయింది. ఇక పుష్ప 2 లో మెయిన్ విలన్ గా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

    Also Read: ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి సాక్షి శివానంద్.. మరి ఇప్పుడు ఎక్కడ ఉంది?