Akshay Kumar: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు అక్షయ్ కుమార్… ఒకప్పుడుఈయన స్టార్ హీరోలతో పోటీపడుతూ తన సినిమాలను రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక 2016 నుంచి 2019 మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. ముఖ్యంగా 2019లో వచ్చిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లు గా నిలిచాయి… అందులో కేసరి, హౌస్ ఫుల్ 4, మిషన్ మంగళ్, గుడ్ న్యూజ్ అనే సినిమాలు 200 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఇలాంటి క్రమం లోనే కరోనా మహమ్మారి రావడం దానివల్ల సినిమా ఇండస్ట్రీకి భారీ దెబ్బ తగలడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఇక కరోనా తర్వాత నుంచి అక్షయ్ కుమార్ చేస్తున్న ఏ సినిమా కూడా సక్సెస్ అయితే సాధించలేదు. ఆయన ఇప్పటివరకు వరుసగా 13 డిజాస్టర్ లను మూటగట్టుకున్నాడు. ఇక ఆయన నుంచి వచ్చే సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించలేకపోతుంది. కాబట్టే ఆయన ఇక మీదట నుంచి మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకొని సక్సెస్ ఫుల్ సినిమాలను చేయాలని భావిస్తున్నారు. ఇక రీసెంట్ గా ‘సర్ఫీరా ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది కూడా డిజాస్టర్ గా మిగలడంతో ఆయనకు కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి…తాప్సి పన్ను, అమ్మి విర్క్, వాణి కపూర్, ప్రగ్యా జైశ్వాల్, ఆదిత్య సీల్, ఫర్ధిన్ ఖాన్ లతో కలిసి ‘ఖేల్ ఖేల్ మే’ అనే సినిమా చేస్తున్నాడు.
Also Read: పుష్ప 2 లో క్యామియో రోల్స్ ప్లే చేస్తున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?
అయితే ఖేల్ ఖేల్ మే అనే సినిమా ఇటాలియన్ కామెడీ డ్రామా గా తెరకెక్కిన పర్ఫెక్ట్ స్ట్రెంజర్స్ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. మరి ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన స్ట్రీ 2, వేద సినిమాలతో పోటీ పడి మరి రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది… అయితే అక్షయ్ కుమార్ ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో ఆయన సక్సెస్ సాధిస్తేనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతాడు.
లేకపోతే మాత్రం తన ప్లాపుల పరంపర ను మరొకసారి కొనసాగించక తప్పదనే చెప్పాలి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మలయాళం లో జీతూ జోసఫ్ డైరెక్షన్ లో మోహన్ లాల్ హీరోగా 12 వ మనిషి అని పేరుతో రీమేక్ చేయబడింది. ఇక అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరి హిందీలో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని రాబడుతోంది అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే అక్షయ్ కుమార్ ఒక్క హిట్ కొట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక వచ్చిన సినిమా వచ్చినట్టుగా డిజాస్టర్ అవుతుంటే ఏ హీరో కైనా ఇలాంటి ఇబ్బంది కలగక మానదు. ఒకప్పుడు సక్సెస్ మ్యాన్ గా పేరు పొందిన అక్షయ్ కుమార్ ఇప్పుడు డిజాస్టర్ల బాట పట్టడం అనేది నిజంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి…ఇక ఇప్పటికే ఈ సినిమా జర్మనీ, జపాన్, స్పెయిన్ , రష్యా తో పాటు గా దాదాపు 20 భాషల్లో రీమేక్ చేయబడింది. మరి ఈ సినిమా అక్షయ్ కుమార్ కు ఎంత వరకు హెల్ప్ అవుతుంది. అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది…
Also Read: ఆ హీరోయిన్ తో సాయిధరమ్ తేజ్ లవ్ మ్యారేజ్.. మెగా ఇంట్లో మరో పెళ్లి.. అసలు క్లారిటీ వచ్చేసిందిగా!