https://oktelugu.com/

Surya: గజిని తర్వాత నుంచి కంగువ వరకు సూర్య చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటో తెలుసా..?

సూర్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లో స్టార్ హీరోగా ఎదుగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తుండటం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : July 25, 2024 / 10:10 AM IST

    Surya

    Follow us on

    Surya: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు సూర్య… గజిని సినిమాతో తమిళ్ , తెలుగు లో నటుడిగా ఎదగడమే కాకుండా రెండు భాషల్లో కూడా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ఆయన తమిళం లో ఏ సినిమా చేసిన కూడా దానిని తెలుగులో రిలీజ్ చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఒక క్యారెక్టర్ కోసం ఎంత ఎఫర్ట్ అయిన పెట్టి నటిస్తాడు. అలాగే ఆ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కెపాసిటీ ఉన్న నటుడు కూడా కావడం విశేషం. ఇక ఆయనకు మొదట్లో హీరోగా మంచి అవకాశాలు వచ్చాయి. అలాగే తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్లందరితో నటించి మంచి సక్సెస్ లను అందుకున్నాడు. ముఖ్యంగా హరి డైరెక్షన్ లో చేసిన ‘సింగం సిరీస్’ ఆయనకు చాలావరకు హెల్ప్ అయింది. ఇక దాంతో పాటుగా మురుగదాస్ డైరెక్షన్ లో చేసిన గజిని, సెవెంత్ సెన్స్ సినిమాలు కూడా అతన్ని నటుడిగా మరొక మెట్టు పైకి ఎక్కించాయనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే సూర్య ఒక మంచి ఇమేజ్ ను అయితే సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన శివ డైరెక్షన్ లో కంగువ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొడితే సూర్య పాన్ ఇండియాలో మొదటి సక్సెస్ ని అందుకున్న వాడు అవుతాడు. ఇప్పటివరకు సూర్య పాన్ ఇండియాలో ఒక సక్సెస్ ను కూడా అందుకోలేదు.

    Also Read: ఆ హీరోయిన్ తో సాయిధరమ్ తేజ్ లవ్ మ్యారేజ్.. మెగా ఇంట్లో మరో పెళ్లి.. అసలు క్లారిటీ వచ్చేసిందిగా!

    కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే ఒక భారీ సక్సెస్ ని కొట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే చాలా రోజుల నుంచి ఈ సినిమా మీద తీవ్రమైన కసరత్తులను చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే మొదటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన చేస్తున్న ఒకే ఒక తప్పు వల్ల ఆయన ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదగలేకపోయాడు. నిజానికి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మిగతా హీరోలతో పోల్చుకుంటే సూర్య టాలెంటెడ్ హీరో అనే చెప్పాలి. ఇక వాళ్ళకంటే కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో కావడం విశేషం…

    ఇక కమర్షియల్ సినిమాలైనా, ఎక్స్పరిమెంటల్ సినిమాలైనా తను అన్ని రకాల జానర్ సినిమాలకు సూర్య సరిపోతాడు. అందువల్లే ఆయన అన్ని రకాల సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే ఆయన చేసిన మిస్టేక్ ఏంటి అంటే కేవలం ఆయన తమిళ్ సినిమా డైరెక్టర్లతో మాత్రమే సినిమాలు చేశాడు. తెలుగులో కూడా ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ ఆయన తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. దానివల్ల ఆయనకు మార్కెట్ అనేది భారీగా పెరగకుండా ఒకే దగ్గర ఆగిపోయింది.

    ఒకవేళ ఆయన కనక తెలుగులో సినిమా చేసి ఉంటే ఇక్కడ కూడా మంచి గుర్తింపు వచ్చేది. తెలుగులో మార్కెట్ అనేది భారీగా పెరిగితే ఆయన క్రేజ్ కూడా ఆటోమేటిగ్గా విపరీతంగా పెరిగి ఆయన మార్కెట్ కూడా విస్తరించేది. కానీ ఆయన చేసిన ఒక్క తప్పు వల్ల ఇప్పటివరకు కూడా ఆయన స్టార్ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. తప్ప నెంబర్ వన్ హీరోగా మాత్రం ఎదగలేకపోయాడు…

     

    Also Read: పుష్ప 2 లో క్యామియో రోల్స్ ప్లే చేస్తున్న స్టార్ హీరోలు వీళ్లేనా