Telangana Budget 2024: రూ.2.91 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌.. వ్యవసాయ, సంక్షేమానికి అగ్రతాంబూలం

తెలంగాణ అసెంబ్లీలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం పూర్తి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2.91 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. వ్యవసాయం, సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు..

Written By: Raj Shekar, Updated On : July 25, 2024 1:19 pm

Telangana Budget 2024

Follow us on

Telangana Budget 2024: తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటలతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలంగాణ బడ్జెట్‌ ప్రసంగాన్ని గురువారం(జూలై 25న) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో పోలిస్తే.. ఈ బడ్జెట్‌ రూ.వేల కోట్లు పెరిగింది. గత ఫిబ్రవరిలో రూ.2.70 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టాగా.. తాజాగా భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్లతో ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2.20 లక్షల కోట్లు కాగా, మూల ధన వ్యయం 33,487 కోట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ వృద్ధి రేటు 7.4గా అంచనా వేశారు. జాతీయ వృద్ధిరేటు 7.6 గా ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వం పనితీరు కారణంగా రాష్ట్ర అప్పులు రూ.6.71,756 కోట్లకు పెరిగిందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చా క చేసిన అప్పులు రూ.35,118 క ఓట్లు అని తెలిపారు. ఇక బడ్జెట్‌లో వ్యవసాయం, సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ప్రాధాన్యం దక్కింది. వ్యవసాయానికి ఈ బడ్జెట్‌లో అత్యధికంగా రూ.72,659 కోట్లు కేటాయించారు. తర్వాత సంక్షేమానికి రూ.40 వేల కోట్లు కేటాయించారు. తర్వాత నీటిపారుదల రంగానికి రూ.26 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇక తెలంగాణలో తలసరి ఆదాయంలో కూడా భారీగా వ్యత్యాసం ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ సగటు తలసరి ఆదాయం రూ.3.4 లక్షల కోట్లు ఉందని తెలిపారు. అయితే హైదరాబాద్‌లో తలసరి ఆదాయం రూ.9.9 లక్షలు ఉండగా, వికారాబాద్‌ జిల్లాలో తలసరి ఆదాయం 1.9 లక్షలు ఉన్నట్లు వెల్లడించారు. ఇక మహిళా సంఘాలకు రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 63.85 లక్షల డ్వాక్రా గ్రూపుల్లో మహిళలకు లబ్ధి కలుగుతుంది. త్వరలో రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో 31 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.

గ్యారంటీ పథకాలకు కేటాయింపులు…
ఇక తెలంగాణ పూర్తి బడ్టెట్‌లో ఆరు గ్యారంటీ పథకాలకు కూడా ప్రాధాన్యం దక్కింది. ఇందులో భాగంగా చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి..

విద్యారంగానికి రూ.21,292 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410
విద్యుత్‌ రంగానికి రూ.16,410 కోట్లు
వైద్యం, ఆరోగ్య శాఖకు 11,468 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి రూ.33, 124 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి రూ17,006
బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు,
హోం శాఖకు రూ.9,327 కోట్లు
జీహెచ్‌ఎంసీ అభివృద్ధికి 10,050 కోట్లు
మైనారిటీల సంక్షేమానికి రూ.30003 కోట్లు,
అడవులు, పర్యావరణానికి రూ.1,6064 క ఓట్లు
పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు..
రూ.500లకే సిలిండర్‌కు రూ.723 కోట్లు
జీహెచ్‌ఎంసీలో మౌలిక వసతులు కల్పనకు రూ.3 వేల కోట్లు
పంచయాతీరాజ్‌ గ్రామీణాభివృద్ధికి రూ.29,815
ప్రజాపంపిణీకి రూ.3,836 కోట్లు
మూసీ రివర్‌ప్రంట్‌ ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు
రీజినల్‌ రింగ్‌రోడ్డుకు 1,525 కోట్లు
ఓఆర్‌ఆర్‌కు రూ.200 కోట్లు
ఆర్‌అండ్‌బీకి రూ.5,767 కోట్లు
హైదరాబాద్‌ మెట్రో అభివృద్ధికి రూ.500 కోట్లు
పాతబస్తీలో మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు
ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు
మహిళా శక్తి పథకానికి రూ.50.41 కోట్ల
ఉద్యానవనానికి రూ.737
పశుసంవర్ధక శాఖకు రూ.1,818 కోట్లు
ఉచిత బస్సు ప్రయాణానికి రూ.2,351 కోట్లు