Kalki 2898 AD: కల్కి లో కృష్ణుడి పాత్ర లో నటించిన నటుడు ఎవరో తెలుసా..?

బాలీవుడ్ వాళ్లకి ఈ సినిమా సక్సెస్ ను చూసిన తర్వాత కంటిమీద కొడుకు లేకుండా పోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఎందుకంటే తెలుగు నుంచి వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది.

Written By: Gopi, Updated On : June 28, 2024 8:45 am

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమాకి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా లో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించే దిశ గా ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి చాలామంది అభిమానులు చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు.

అందులో భాగంగానే శ్రీ కృష్ణుడి పాత్రలో నటించిన నటుడు గురించి చాలా గొప్ప గా చెప్పుకుంటున్నారు. నిజానికి ఆయన ముఖం క్లారిటీగా కనిపించదు. ఇక ఆయన ఎవరు అని చాలా మంది జనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వెతుకుతున్నారు ఇక అందుతున్న సమాచారం ఆ వ్యక్తి కృష్ణ కుమార్ అనే నటుడు అని తెలుస్తుంది. ఇండస్ట్రీలో పలు రంగాల్లో కూడా రాణించాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా కృష్ణకుమార్ ను కేకే అని కూడా పిలుస్తారు. అయితే నాగ్ అశ్విన్ కృష్ణ కుమార్ ను శ్రీకృష్ణుడి క్యారెక్టర్ కోసం తీసుకున్నాడు.

అయితే ఇతని పాత్రకి తమిళ నటుడు అయిన అర్జున్ దాసుతో డబ్బింగ్ కూడా చెప్పించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఆ పాత్ర పోషించినందుకు గాను ఆయనకు ఆ తర్వాత కూడా మంచి అవకాశాలు వచ్చే ఛాన్సలు అయితే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడమే కాకుండా అభిమానులు కూడా ఈ సినిమాను చూడటానికి ఉత్సాహ పడుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక బాలీవుడ్ వాళ్లకి ఈ సినిమా సక్సెస్ ను చూసిన తర్వాత కంటిమీద కొడుకు లేకుండా పోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఎందుకంటే తెలుగు నుంచి వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది. కానీ వాళ్ళ సినిమాలు మాత్రం ఆశించిన మేరకు ఫలితాలను ఇవ్వడం లేదు. కాబట్టి వాళ్ళు ఇప్పటికే చాలా వరకు నలిగిపోతుంటే ఇక ‘మూలిగే నక్క మీద తాడిపండు పడ్డట్టు’ కల్కి వచ్చి ఇంక వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఇండియా లో నెంబర్ వన్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ అనే చెప్పుకోవాలి…