Cricketers Nicknames: ఈ క్రికెటర్లు నిక్ నేమ్ లతోనే ఫేమస్

క్రికెట్ గాడ్ గా పేరుపొందిన సచిన్ టెండూల్కర్.. టెస్ట్ , వన్డేలలో పరుగుల వరద పారించాడు. టీమిండియా కు అద్భుతమైన విజయాలు అందించాడు. తన బ్యాటింగ్ శైలి ద్వారా మాస్టర్ బ్లాస్టర్ అనే పేరును సంపాదించుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 28, 2024 8:57 am

Cricketers Nicknames

Follow us on

Cricketers Nicknames: క్రికెట్ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఎంత మంది క్రీడాకారులు ఆడారు. ఆడుతూనే ఉన్నారు. అలా ఆ ఆటకు ఎంతోమంది వన్నె తెచ్చారు. ఆ వన్నె తెచ్చిన వారిలో వీరు ఎప్పటికీ ప్రత్యేకం.. అందువల్లే క్రికెట్ ప్రపంచం వీరికి ముద్దు పేర్లు పెట్టింది. ఇంతకీ వారెవరంటే..

సచిన్ టెండూల్కర్: మాస్టర్ బ్లాస్టర్

క్రికెట్ గాడ్ గా పేరుపొందిన సచిన్ టెండూల్కర్.. టెస్ట్ , వన్డేలలో పరుగుల వరద పారించాడు. టీమిండియా కు అద్భుతమైన విజయాలు అందించాడు. తన బ్యాటింగ్ శైలి ద్వారా మాస్టర్ బ్లాస్టర్ అనే పేరును సంపాదించుకున్నాడు.

అరవింద డిసిల్వ, మ్యాడ్ మ్యాక్స్

ఇప్పటి తరానికి తెలియదు కానీ..90 ల కాలంలో అరవింద డిసిల్వ అంటే తెలియని వారు ఉండరు. అద్భుతమైన ఆటతీరుతో శ్రీలంక జట్టుకు తిరుగులేని విజయాలు కట్టబెట్టాడు. తన నాయకత్వంలో శ్రీలంక జట్టును అద్భుతమైన స్థితిలో నిలబెట్టాడు. కళ్ళు మూసి తెరిచేలోపు పరుగులు రాబట్టి.. మ్యాడ్ మ్యాక్స్ అనే పేరును సంపాదించుకున్నాడు.

మెక్ గ్రాత్, పీగన్

ఆస్ట్రేలియా స్పీడ్ బౌలర్ గా, లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు వేసి.. ప్రత్యర్థి ఆటగాళ్లకు సింహ స్వప్నం లాగా నిలిచాడు మెక్ గ్రాత్.. తన అద్భుతమైన బౌలింగ్ తో చిరస్మరణీయమైన విజయాలను ఆస్ట్రేలియా జట్టుకు కట్టబెట్టాడు. అందువల్ల ఇతడిని పీగన్ అని పిలిచేవారు.

రికీ పాంటింగ్, పంటర్

ఆస్ట్రేలియా జట్టుకు అద్భుతమైన విజయాలు అందించిన వారిలో రికీ పాంటింగ్ ఒకరు. వన్డే వరల్డ్ కప్ ను అందించిన కెప్టెన్ గా పాంటింగ్ కు పేరుంది. అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిన పాంటింగ్ ను కంగారు జట్టు అభిమానులు అప్పట్లో పంటర్ అని పిలిచేవారు.

సునీల్ గవాస్కర్, లిటిల్ మాస్టర్

ఈ తరం వారి కంటే తెలియకపోవచ్చు గాని..90 ల కాలంలో టీమిండియాలో సునీల్ గవాస్కర్ పేరుపొందిన ఆటగాడిగా ఉండేవాడు.. దూకుడు అయిన ఆటతీరుతో అలరించేవాడు. అందుకే అతడిని ఆ రోజుల్లో లిటిల్ మాస్టర్ అని పిలిచేవారు.

కపిల్ దేవ్, హర్యానా ఎక్స్ ప్రెస్

టీమిండియాకు తొలి వరల్డ్ కప్ అందించిన ఘనత కపిల్ దేవ్ ది. ఇంకా మరెన్నో టోర్నీలలో టీమిండియా కు అద్భుతమైన విజయాలు కట్టబెట్టాడు. అందువల్లే అతడిని హర్యానా ఎక్స్ ప్రెస్ అని పిలుస్తారు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో కపిల్ దేవ్ ది అందె వేసిన చెయ్యి.

మునాఫ్ పటేల్, ఇఖార్ ఎక్స్ ప్రెస్

వైవిధ్య భరితమైన బంతులు వేయడంతో పాటు వికెట్లు తీయడంలో టీం ఇండియా మాజీ బౌలర్ మునాఫ్ పటేల్ ది ప్రత్యేక శైలి. అందువల్లే అతడు ఇఖార్ ఎక్స్ ప్రెస్ గా పేరు పొందాడు. టీమిండియా సాధించిన విజయాలలో తన వంతు పాత్ర పోషించాడు..

షోయబ్ అఖ్తర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్

సమకాలీన క్రికెట్లో వేగవంతమైన బంతులు వేసే బౌలర్ గా పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ అక్తర్ పేరు గడించాడు.. బుల్లెట్ లాంటి బంతులు సంధించి ప్రత్యర్థి బ్యాటర్లలో వణుకు పుట్టించేవాడు. అందుకే ఇతడికి రావిల్పిండి ఎక్స్ ప్రెస్ అనే పేరు వచ్చింది.

రాహుల్ ద్రావిడ్, ది వాల్

టెస్ట్, వన్డే క్రికెట్లో ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వికెట్ ను అలానే అంటిపెట్టుకొని ఉండేవాడు రాహుల్ ద్రావిడ్. టీమ్ ఇండియా సాధించిన అద్భుతమైన టెస్ట్ విజయాలలో తన వంతు పాత్ర పోషించాడు రాహుల్ ద్రావిడ్. అందువల్లే అతనికి వాల్ అనే పేరు వచ్చింది.

హర్భజన్ సింగ్, ది టర్బోనేటర్

దూస్రా వంటి వైవిధ్యమైన బంతులు వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించేవాడు హర్భజన్ సింగ్. భారత్ సాధించిన అనేక విజయాలలో తన వంతు పాత్ర పోషించాడు హర్భజన్. అప్పుడప్పుడు బ్యాట్ తోనూ మెరిసే వాడు. అందుకే అతడికి టర్బోనేటర్ పేరు స్థిరపడిపోయింది.

అనిల్ కుంబ్లే, జంబో

భారత స్పిన్ బౌలింగ్ ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన బౌలర్లలో అనిల్ కుంబ్లే కు ప్రత్యేక స్థానం ఉంటుంది. తనకు మాత్రమే సాధ్యమైన ఆఫ్ స్పిన్ లో బంతులను గింగిరాలు తిప్పేవాడు. అందువల్లే అతడికి జంబో అనే నిక్ నేమ్ స్థిరపడిపోయింది.

మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, టైగర్

1960,70 ల కాలంలో టీమిండియా కు వెన్నెముకగా నిలిచిన వాడు మన్సూర్ అలీ ఖాన్. అద్భుతమైన బ్యాటింగ్ తో టీమిండియా కు ఎన్నో విజయాలు అందించాడు. దూకుడు అయిన ఆటతీరుకు పర్యాయపదంగా నిలిచాడు. అందువల్లే అతనికి టైగర్ అనే ముద్దు పేరు స్థిరపడిపోయింది..

దిలీప్ వెంగ్ సర్కార్, కొలోనియల్

1970, 80 ల కాలంలో టీమిండియాలో దిలీప్ వెంగ్ సర్కార్ పేరు మారుమోగిపోయేది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో అతడు సత్తా చాటేవాడు. టీమిండియా సాధించిన అనేక విజయాలలో కీలక భూమిక పోషించాడు. అందుకే అతడికి కొలోనియల్ అనే నిక్ నేమ్ స్థిరపడిపోయింది.