Nag Ashwin: తన ఇన్ స్టా లో చెప్పుల ఫోటో పెట్టిన నాగ్ అశ్విన్..దాని వెనక అంత కథ ఉందా..?

నాగ్ అశ్విన్ తన అరిగిపోయిన చెప్పులను ఫోటోలు తీసి తన ఇన్ స్టా లో అప్లోడ్ చేస్తూ ఈ సినిమా కోసం తిరిగి తిరిగి నా చెప్పులు అరిగిపోయాయి అని అర్థం వచ్చేలా కొన్ని మాటలు కూడా రాశాడు.

Written By: Gopi, Updated On : June 28, 2024 8:38 am

Nag Ashwin

Follow us on

Nag Ashwin: ప్రస్తుతం కల్కి సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న నాగ్ అశ్విన్ ఈ సినిమా కంగ్ రన్ లో భారీ సక్సెస్ సాధిస్తుందనే కాన్ఫిడెన్స్ తో అయితే ఉన్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డాడు. మూడున్నర సంవత్సరాలపాటు తెరకెక్కించిన ఈ సినిమా కోసం ఆయన అహర్నిశలు కష్టపడడమే కాకుండా తన టీమ్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు అటెన్షన్ లో ఉండేలా చూసుకుంటూ వస్తున్నాడు. ఇక మొత్తానికైతే నాగ్ అశ్విన్ ఈ సినిమాతో తను అనుకున్నట్టుగానే ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ తన అరిగిపోయిన చెప్పులను ఫోటోలు తీసి తన ఇన్ స్టా లో అప్లోడ్ చేస్తూ ఈ సినిమా కోసం తిరిగి తిరిగి నా చెప్పులు అరిగిపోయాయి అని అర్థం వచ్చేలా కొన్ని మాటలు కూడా రాశాడు. ఇక మొత్తానికైతే గమ్యం చేరుకోవడానికి చేసే ప్రయాణం చాలా గొప్పది అంటూ చెప్పాడు. ఇక 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ కలెక్షన్లు రాబడుతోంది అంటూ ట్రేడ్ పండితులు సైతం లెక్కలు వేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే మొదటి రోజు కూడా భారీ కలెక్షన్స్ సంపాదించుకున్న ఈ సినిమా వీకెండ్స్ మొత్తం భారీ వసూళ్లను కలెక్ట్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాతో చాలామంది అభిమానులు తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన నాగ్ అశ్విన్ పట్ల తెలుగు వాళ్ళంతా హ్యాపీ గా ఉన్నారు.

ఇక చాలామంది తమ అభిమాన హీరో అయిన ప్రభాస్ ని ఒక అల్టిమేట్ క్యారెక్టర్ లో చూపించినందుకు నాగ్ అశ్విన్ కి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. ఇక రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్లు సైతం కల్కి సినిమా గురించి ఆ సినిమా తనకు విపరీతంగా నచ్చిందని చెప్పడం అలాగే చాలా అద్భుతంగా ఉందని చెప్పడం కూడా గొప్ప విషయమనే చెప్పాలి…