OG completes 50 days: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ఓజీ(They Call Him OG). పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ఈ సినిమా, విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకోవడం లో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. మామూలు ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసి యావరేజ్ అని చెప్పినప్పటికీ ఫ్యాన్స్ కి బాగా నచ్చడం తో కమర్షియల్ గా ఈ చిత్రం వర్కౌట్ అయ్యింది. అయితే నిన్న గాక మొన్న విడుదలైనట్టు అనిపిస్తున్న ఈ చిత్రం అప్పుడే 50 రోజులు పూర్తి చేసుకుంది. కడప జిల్లాలోని రైల్వే కోడూరు లో తప్ప, ఎక్కడా ఈ సినిమా 50 రోజులు రెగ్యులర్ గా ఆడలేదు. అనేక ప్రాంతాల్లో 43 రోజులకే ఎత్తేసారు.
వైజాగ్, విజయవాడ, అమలాపురం, అనంతపురం, తిరుపతి ఇలా దాదాపుగా 15 సెంటర్స్ లో 43 రోజులకే థియేటర్స్ నుండి ఎత్తివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క వారం రోజులు ఆడి ఉండుంటే 15 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న చిత్రంగా ఓజీ నిలిచేది. కానీ క్షేత్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలాంటి వాటిని ప్రోత్సహించడం చాలా తక్కువ. మిగిలిన హీరోలు అయితే తమ పలుకుబడిని ఉపయోగించి 50 రోజులు ఆడించేవారు. కానీ పవన్ కళ్యాణ్ కానీ, ఆయన అభిమానులు కానీ ఇలాంటివి పట్టించుకోరు, ఆడినన్ని రోజులు ఆడేసి వెళ్తుంది. ఈ సినిమాకు కూడా అదే చేశారు. అయితే అభిమానుల కోరిక మేరకు కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో ఓజీ చిత్రం 50 డేస్ స్పెషల్ షోస్ ని ప్లాన్ చేశారు.ముఖ్యంగా హైదరాబాద్ లో దాదాపుగా 11 థియేటర్స్ లో స్పెషల్ షోస్ ని షెడ్యూల్ చేశారు.
నేడు సెకండ్ షోస్ తో మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్స్ లో సంబరాలు చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఈ షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు. కేవలం రెండు మూడు థియేటర్స్ మాత్రమే ఫుల్స్ అయ్యాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అయితే కేవలం విజయవాడ లో మాత్రమే స్పెషల్ షోస్ వేశారు. జయరాం థియేటర్ లో మ్యాట్నీ మరియు ఫస్ట్ షోస్ ని ప్లాన్ చేశారు. ఫస్ట్ షో కి అభిమానులు 200 కేజీల పేపర్ కట్స్ తీసుకెళ్తున్నారట. చూడాలి మరి చివరిసారి పవన్ కళ్యాణ్ అభిమానుకు ఓజీ థియేటర్స్ లో ఎలాంటి అనుభూతి ఇస్తుంది అనేది.