Couple Friendly 10 days collections: ఈ వాలెంటైన్స్ డే కానుకగా సంతోష్ శోభన్(Santosh Sobhan), మానస వారణాసి(Manasa Varanasi) హీరోయిన్లు గా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly) చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా , అది జనాల్లోకి బాగా వ్యాప్తి చెందకపోవడం తో మొదటి వారం కాస్త చప్పగానే కలెక్షన్స్ నమోదు అయ్యాయి . అయితే రెండవ వీకెండ్ కి ముందు రెబల్ స్టార్ ప్రభాస్ తో మూవీ టీం ఇచ్చిన ఇంటర్వ్యూ బాగా హిట్ అవ్వడంతో ఈ సినిమా కి ఫ్రీ పబ్లిసిటీ అయ్యింది. దీంతో బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యమని అనుకున్న ట్రేడ్ విశ్లేషకులకు రెండవ వీకెండ్ అద్భుతమైన గ్రోత్ ని బాక్స్ ఆఫీస్ వద్ద చూపిస్తూ ఈ సినిమాకు నమోదైన వసూళ్లు షాక్ కి గురయ్యేలా చేసింది.
10 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 10 వ రోజున వరల్డ్ వైడ్ గా 60 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు , 27 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు నమోదు అయ్యాయట. ఓవరాల్ గా ఈ చిత్రానికి 10 రోజుల్లో ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 2.11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ నుండి 2.33 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి . ఓవరాల్ గా 10 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి 8.85 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 4.44 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుండి మంచి వసూళ్లు అయితే నమోదు అవుతున్నాయి కానీ , ఇతర ప్రాంతాల నుండి మాత్రం అవ్వడం లేదు .
ఉదాహరణకు ఇలాంటి లవ్ స్టోరీ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉంటుంది. భారీ వసూళ్లు నమోదు అవుతుంటాయి , కానీ ఈ చిత్రం మాత్రం ఓవర్సీస్ లో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. మొత్తం మీద ఓవర్సీస్ + కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి ఈ చిత్రానికి కేవలం 97 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి . ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా `11.20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 5.41 షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇక కేవలం 1.1 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టాలి. ఈ వారం లో ఆ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టబోతుంది.