spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi watches Ustad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' ని కుటుంబం తో కలిసి...

Chiranjeevi watches Ustad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని కుటుంబం తో కలిసి చూసిన మెగాస్టార్ చిరంజీవి.. వీడియో వైరల్!

Chiranjeevi watches Ustad Bhagat Singh: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ భారీ ఓపెనింగ్స్ ని కొల్లగొట్టడం పవన్ కళ్యాణ్ కి వెన్నతో పెట్టిన విద్య లాంటిది. కానీ ఈ చిత్రానికి మాత్రం కలలో కూడా ఊహించనంత తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కూడా 70 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాంటిది ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ కి కేవలం 53 కోట్ల రూపాయిల ఓపెనింగ్ రావడం పవన్ కళ్యాణ్ స్టామినా కి ఘోరమైన అవమానం అని చెప్పొచ్చు. ఇది కాసేపు పక్కన పెడితే మేకర్స్ మాత్రం ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు.

నిన్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తో కలిసి పవన్ కళ్యాణ్ వీక్షించడం , అందుకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియా లో మేకర్స్ అప్లోడ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి తో పాటు సురేఖ, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా వంటి వారు కూడా స్పెషల్ ప్రీమియర్ షో కి హాజరయ్యారు. అదే విధంగా సినిమాలో నటించిన శ్రీలీల , డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాతలు నవీన్ , రవి శంకర్ వంటి వారు కూడా ఈ ప్రీమియర్ షోలో తళుక్కుమని మెరిశారు. ఈ వీడియో కి సోషల్ మీడియా లో మంచి రీచ్ వచ్చింది. అయితే ఫ్లాప్ సినిమాకు ఇలా మెగాస్టార్ రావడం లో పెద్ద కిక్ అనిపించలేదు, అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘ఓజీ’ కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కి కూడా మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబం తో కలిసి స్పెషల్ ప్రీమియర్ షో చూసాడు. అప్పుడు అభిమానులు అంతా సంబరాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు. పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు రిక్వెస్ట్ చేస్తూ, దయచేసి ఇలాంటి అవుట్ డేటెడ్ కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2026 వ సంవత్సరం లో కూడా, 2012 కాలం నాటి సినిమా అంటే, అభిమానులే థియేటర్స్ కి వెళ్లి చూసే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాల్లో కనిపించబోతున్నాడో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

SKN Producer: యంగ్ హీరోయిన్ కి దిమ్మతిరిగే కౌంటర్లు ఇచ్చిన నిర్మాత SKN ..పాపం పరువు పోయిందిగా..

SKN Producer: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్...

Telugu Heroes: సక్సెసులు లేని హీరోలకు ఈ ఇయర్ బాగా కలిసి వస్తుందిగా…

Telugu Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎప్పటికప్పుడు సక్సెస్ లను సాధిస్తుండాలి. లేకపోతే మాత్రం వాళ్ల మార్కెట్ పూర్తిగా పడిపోయే ప్రమాదమైతే ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ లు...

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Oktelugu Epaper
Exit mobile version