Noise Scout Kids smartwatch: ప్రస్తుత కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ అయి ఉంటున్నారు. పిల్లలు గేమ్స్ చూస్తే.. పెద్దలు తమ కార్యకలాపాల కోసం మొబైల్ ను వాడుతున్నారు. అయితే తల్లిదండ్రులే పిల్లలకు స్మార్ట్ఫోన్ అలవాటు చేస్తున్నారన్న విషయం అతిశయోక్తి కాదు. కానీ స్మార్ట్ ఫోన్ కు బదులు స్మార్ట్ వాచ్ లేదా ఇతర పరికరాలను వారికి ఇవ్వడం వల్ల ఎంతో సంతోషిస్తారు. అంతేకాకుండా కొన్ని రకాల స్మార్ట్ వాచ్ లతో వారికి సేఫ్టీ కూడా ఉంటుంది. ఈ రకమైన పరికరాలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. నాటు వివరాలు లోకి వెళ్తే..
చిన్నపిల్లలకు ఒకప్పుడు బొమ్మలు కొనిస్తే వారు ఎంతో సంతోషించేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు టెక్నాలజీతో కూడిన బొమ్మలను అందిస్తున్నారు. అయితే కొంతమంది చేతికి వాచ్ పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులకు ఫోర్స్ చేస్తారు. అయితే తల్లిదండ్రులు వారికి సాధారణ వాచ్ ల కంటే స్మార్ట్ వాచ్ లను ఇవ్వడం వల్ల అన్ని రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో మూడు రకాల స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా జిపిఎస్ ట్రాకింగ్, కాలింగ్ ఫీచర్, ఎస్ఎంఎస్ అలర్ట్ వంటివి ఫీచర్లు ఉండడంవల్ల వారు ఎక్కడున్నారో వెంటనే తెలుసుకోవచ్చు. వీటిలో ముఖ్యమైన వాటి గురించి..
Noise బ్రాండ్ నుంచి మార్కెట్లోకి వచ్చిన Scout Kids స్మార్ట్ వాచ్ పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ తో పిల్లలు ఎక్కడ ఉన్నా వెంటనే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో జిపిఎస్ ట్రాకింగ్ తోపాటు వారు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి కాల్ కూడా చేయవచ్చు. అలాగే ఇందులో ఎస్ఓఎస్ బటన్ ఉండడం వల్ల వారి ట్రాకింగ్ ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వాచ్ కలర్ ఫుల్ గా ఉండడంతోపాటు ఇందులో కొన్ని రకాల గేమ్స్ ఉండడంతో పిల్లలు వీటిని ధరిస్తే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు. దీని ధర రూ.5,000 నుంచి ప్రారంభం అవుతుంది. మరో కంపెనీ boAt కు చెందిన wonder kids స్మార్ట్ వాచ్ కూడా అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ లో పైన ఉన్న వాచ్ లో ఉండే ఫీచర్స్ తో పాటు 4G సిమ్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంతో వీడియో కాలింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు వేరే ఊర్లో ఉన్నా కూడా ఇంటర్నెట్ ద్వారా వీడియో కాలింగ్ మాట్లాడుకోవచ్చు. దీనిని కూడా రూ.5000 నుంచే కొనుగోలు చేయవచ్చు.
Fire Bottle Kids Watch కూడా బెస్ట్ ఫీచర్స్ తో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులో కాలింగ్, జిపిఎస్ టాకింగ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కోసం రకరకాల ఫీచర్లు ఉన్నాయి. వీటి ధర కూడా బడ్జెట్లోనే ఉండడం విశేషం. స్మార్ట్ ఫోన్ వల్ల పిల్లల కు అనేక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ వాచ్ వల్ల వారు ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. అంతేకాకుండా జిపిఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉండడంతో వారు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు.
