Site icon OkTelugu

Jr NTR Allu Arjun and Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో అవసరం తీరిపోయాక అతన్ని పట్టించుకొని ఎన్టీఆర్, అల్లు అర్జున్..

Jr NTR Allu Arjun and Pawan Kalyan

Jr NTR Allu Arjun and Pawan Kalyan

Jr NTR Allu Arjun and Pawan Kalyan: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ అప్పటినుంచి ఇప్పటివరకు ఎక్కడ తగ్గకుండా వరుస సినిమాలను చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి… ప్రస్తుతం ఆయన రాజకీయ రంగంలో తన మార్క్ చూపిస్తూనే అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలనైతే చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. స్టేట్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకొని ఏ ప్రాబ్లం ఉంది. జనాన్ని ఎలా ఆదుకోవాలి అనే కార్యక్రమాలను సైతం పవన్ కళ్యాణ్ చేపడుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయింది. ఇక్కడి వరకు బాగానే ఉంది మన తెలుగు స్టార్ హీరోలందరు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఇక ఉస్తాద్ తో పాటు రిలీజైన ‘దురంధర్ 2’ సినిమా బాగుందంటూ సోషల్ మీడియా లో పోస్టు లు పెడుతున్నారు.

అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి లాంటి వారు ‘దురంధర్ 2’ సినిమా బాగుందంటు కామెంట్స్ చేయడం పైన పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతవరకు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ పుష్ప 2, జూనియర్ ఎన్టీఆర్ దేవర, వార్ 2 సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచాలని పవన్ కళ్యాణ్ ను ఆశ్రయించారు. దాంతో పవన్ కళ్యాణ్ టిక్కెట్ రేట్లను పెంచడానికి అనుమతి ఇచ్చాడు…

Also Read: రవితేజ ఆ టైమ్ లో పవన్ కళ్యాణ్ ను పట్టించుకోకపోవడానికి కారణమేంటంటే..?

కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిన కూడా దాని గురించి మాట్లాడకుండా అవతలి సినిమా బాగుందని చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ల మీద తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వాళ్లకు నెగెటివ్ గా కామెంట్లు కూడా చేస్తున్నారు. మన హీరోలు ఎందుకని ఇలా కామెంట్స్ చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు.

నిజానికి బాలీవుడ్ వాళ్ళు మన సినిమా రిలీజ్ అయితే ఒక్క ట్వీట్ కూడా చేయరు. మన సినిమా సూపర్ సక్సెస్ అయిన కూడా వాళ్లు అసలు పట్టించుకోరు. మరి మనవాళ్లు మాత్రం బాలీవుడ్ సినిమాలను ఎందుకని ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ కి నమ్మకద్రోహం చేశారు అంటూ కామెంట్లు చేస్తుండటం విశేషం…

Exit mobile version