https://oktelugu.com/

Allu Arjun: పవన్ కళ్యాణ్ ను కలువబోతున్న అల్లు అర్జున్… డీల్ సెట్ చేసిన టాప్ ప్రొడ్యూసర్…

పుష్ప 2 సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనే ఒక చిన్న ఆందోళనలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రొడ్యూసర్స్ అందరూ పవన్ కళ్యాణ్ ని కలవడానికి వెళ్లినపుడు వాళ్లలో అల్లు అరవింద్ కూడా వెళ్ళాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 26, 2024 / 09:37 AM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఆయన హీరోగా పలు సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక దాంతో పాటుగా ఇప్పుడు రాజకీయంగా కూడా తన ప్రస్థానాన్ని విస్తరించుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

    ఇక దానికి తగ్గట్టుగానే రీసెంట్ గానే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ సీఎం గా బాధ్యతలను నిర్వర్తిస్తూనే పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా వైసీపీ పార్టీకి మద్దతు తెలిపిన అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇక ఈ రకంగా ఆయన సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలాగైనా సరే మరోసారి పవన్ కళ్యాణ్ ని కలిసి మేమంతా ఒక్కటే అని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

    ఇక లేకపోతే ఆయన పుష్ప 2 సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనే ఒక చిన్న ఆందోళనలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రొడ్యూసర్స్ అందరూ పవన్ కళ్యాణ్ ని కలవడానికి వెళ్లినపుడు వాళ్లలో అల్లు అరవింద్ కూడా వెళ్ళాడు. ఇంక అక్కడికి వెళ్లి పవన్ కళ్యాణ్ తో మాట్లాడాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని అల్లు అరవింద్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అని ఒకసారి అన్నాక మళ్లీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి కలిశాడు.

    అలాగే ఇప్పుడు మరోసారి వైసీపీ పార్టీ తరపున క్యాంపెనింగ్ చేసిన ఆయన పవన్ కళ్యాణ్ ను కలిసి మరోసారి వాళ్ల మధ్య ఉన్న బాండింగ్ ను నిరూపించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి అల్లు అర్జున్ వచ్చి పవన్ కళ్యాణ్ ను కలిస్తే ఆయన ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది…