Bharateeyudu 2: భారతీయుడు 2 సినిమా కోసం కమలహాసన్ విపరీతంగా కష్టపడ్డాడట. ఇక ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో ఆయన సినిమాలో తన స్థాయి పర్ఫామెన్స్ ఇవ్వడానికి ఆయన చాలా ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. తను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఒక పాత్ర కోసం బరువు పెరగడం తగ్గడం లాంటివి ఈజీగా చేస్తూ ఆ పాత్రలోకి తను పరకాయ ప్రవేశం చేసి నటించేవాడు. ఇక ఇదిలా ఉంటే భారతీయుడు 2 సినిమా కోసం ఆయన మేకప్ పరంగా విపరీతంగా కష్టపడ్డట తనకు మేకప్ వేయడానికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టేదట.
ఒక్కొక్కసారైతే అంతకంటే ఎక్కువ సమయం పట్టెదట. ఇక ఈ ఏజ్ లో కూడా ఆయన ఓపిగ్గా కూర్చొని మేకప్ వేయించుకొని సినిమా షూట్ మార్నింగ్ 6 గంటలకు అంటే దాదాపు మూడు గంటలకే వచ్చి మేకప్ వేసుకొని ఆరు గంటలకు సెట్ లో రెడీగా ఉండేవారట. ఇక ఈయన ఇంతా డెడికేషన్ చూపిస్తున్నాడు కాబట్టే ఆయన లోకనాయకుడు అయ్యాడని చాలామంది ఆయన మీద సోషల్ మీడియాలో పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఇప్పటికే కమలహాసన్ లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఒక వరం లాంటోడని చాలామంది లెజెండరీ నటులు సైతం అతన్ని పొగడడం మనం చూసాము.
ఇక ఇప్పుడు కూడా ఆయన మరోసారి భారీ సక్సెస్ ని సాధించడానికి రెడీ అవుతున్నాడు. విజువల్ ట్రీట్ గా తెరకెక్కబోతున్న భారతీయుడు 2 సినిమా కమలహాసన్ కి మరొక విక్టరీని సాధించిపెడుతుందంటూ చాలామంది అభిమానులు మంచి కాన్ఫడెంట్ తో అయితే ఉన్నారు. ఇక చాలా సంవత్సరాల నుంచి ఆయన సక్సెస్ లేక బాధపడుతున్నాడు కాబట్టి ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని సాధించి మరోసారి పాన్ ఇండియాలో చిరస్మరణీయంగా నిలిచిపోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు.
ఇక ఎప్పుడో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన శంకర్ కి ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా డైరెక్టర్లు గా మారుతున్న వాళ్ళు సైతం అతనికి పోటీని ఇస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో పాన్ ఇండియా లో మరొకసారి పాన్ ఇండియా లో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది…