Homeఎంటర్టైన్మెంట్Tollywood Movie Updates 22.09.2021: టాలీవుడ్ నేటి ఎక్స్ క్లూజివ్ కబుర్లు...

Tollywood Movie Updates 22.09.2021: టాలీవుడ్ నేటి ఎక్స్ క్లూజివ్ కబుర్లు !

Tollywood Movie Updates: నేటి టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. హోమ్లీ బ్యూటీ కీర్తి సురేశ్ ఒక ఇంట్రెస్టింగ్ సినిమాలో నటించబోతుంది. తమిళ హాస్యనటుడు వడివేలు హీరోగా వస్తోన్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించబోతుంది. కాకపోతే కీర్తి సురేశ్ అతనికి జంటగా నటించదని.. సినిమాలో ఆమెది సినిమా హీరోయిన్ పాత్ర అని టాక్. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తోన్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ నవంబర్ 7వ […]

Tollywood Movie UpdatesTollywood Movie Updates: నేటి టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. హోమ్లీ బ్యూటీ కీర్తి సురేశ్ ఒక ఇంట్రెస్టింగ్ సినిమాలో నటించబోతుంది. తమిళ హాస్యనటుడు వడివేలు హీరోగా వస్తోన్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించబోతుంది. కాకపోతే కీర్తి సురేశ్ అతనికి జంటగా నటించదని.. సినిమాలో ఆమెది సినిమా హీరోయిన్ పాత్ర అని టాక్.

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తోన్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ నవంబర్ 7వ తేదీ నుంచి స్టార్ట్ కానుంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ తో షూట్ ను స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా తమిళ హీరో మాధవన్ నటించనున్నాడు.

ప్రకాశ్ రాజ్ మెయిన్ లీడ్ లో కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘రంగమార్తాండ’. కాగా ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. ఓటీటీ వేదికగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని కృష్ణవంశీ ప్లాన్ చేస్తున్నాడు. జీ5 తో ఇప్పటికే చర్చలు కూడా మొదలయ్యాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా రిలీజ్ పై ఎటు తేల్చుకోలేకపోతున్నాడు. ఈ సినిమా నిర్మాతలు ఓటీటీకి అమ్మాలని ఆశ పడుతున్నారు. కానీ, నాని ఇప్పటికే థియేటర్స్ లోనే తన సినిమాని రిలీజ్ చేస్తానని మాట ఇచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ప్రస్తుతానికి నిర్మాతల నిర్ణయమే ఫైనల్ అని తెలుస్తోంది.

నటసింహం బాలయ్య బాబుతో యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేస్తోన్న ‘అఖండ’ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ రోజు నుంచి ఈ సినిమా డబ్బింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ కి సింగర్ గీతామాధురి ఈ రోజు నుంచి డబ్బింగ్ చెప్పనుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper