Trivikram- Mahesh Movie: టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబో లు ఉంటాయి. వాటిలో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ జోడి. వీరి కలయికలో గతంలో 2 సినిమాలు వచ్చాయి. ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయాయి. కానీ ఎప్పుడు టీవీ లో వేసినా మంచి TRP రేటింగ్స్ వస్తాయి. ఎప్పుడు చూసినా ఫ్రెష్ గానే అనిపిస్తాయి ఈ సినిమాలు.
తాజాగా వీరి కాంబో లో రాబోతున్న గుంటూరు కారం సినిమాకు వాళ్ళిద్దరి గత రెండు సినిమాలకు ఒక పోలిక అయితే కనిపిస్తుంది. వాస్తవానికి 2005 లో విడుదలైన అతడు సినిమా తీయడానికి ఆ రోజుల్లోనే దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. ఆ తర్వాత తీసిన ఖలేజా సినిమా కు ఏకంగా మూడేళ్ల టైం తీసుకున్నారు. ఇప్పుడు సెట్స్ పై ఉన్న గుంటూరు కారం సినిమా సైతం అనేక కారణాలతో ఆలస్యం అవుతుంది.
ముందుగా ఈ సినిమాకు KGF కోసం వర్క్ చేసిన ఫైట్ మాస్టర్స్ ను తీసుకోని భారీ ఫైట్ ను షూట్ చేశారు. కానీ ఎందుకో వాళ్ళ వర్క్ స్టైల్ నచ్చకపోవడంతో వారికి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇచ్చేసి పక్కన పెట్టారు. ఆ తర్వాత మహేష్ బాబు, పూజ హెగ్డే తో మాల్ లో కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు, కానీ ఆ సీన్స్ సరిగ్గా రాలేదని వాటిని డస్టుబిన్ లో వేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఏకంగా హీరోయిన్ పూజా హెగ్డే ను మార్చి, సెకండ్ హీరోయిన్ శ్రీ లీలను మెయిన్ హీరోయిన్ చేసి అందుకు తగ్గట్టుగా కథను మార్చినట్లు సమాచారం.
అసలు ఈ సినిమా స్టార్ట్ కాకముందు స్టోరీ విషయంలో మహేష్ బాబు అభ్యంతరం పెట్టటంతో పాటుగా బౌండెడ్ స్క్రిప్ట్ కావాలని చెప్పటంతో త్రివిక్రమ్ కిందామీదా పడి మహేష్ బాబు ను ఒప్పించి సినిమా మెదలుపెట్టాడు. స్టార్ట్ అయిన దగ్గర నుండి ఏదో ఒక కారణంతో షూటింగ్ కి గ్యాప్ వస్తూనే ఉంది. మరోపక్క మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వర్క్ విషయంలో మహేష్ అసంతృప్తి గా ఉన్నాడని దీంతో అతన్ని తప్పించినట్లు వార్తలు కూడా వచ్చాయి. దీనిపై తమన్ క్లారిటీ ఇవ్వటంతో అది కేవలం రూమర్స్ అని తేలిపోయింది. ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ గుంటూరు కారం సినిమా ముందు చెప్పుకున్నట్లు వచ్చే ఏడాది సంక్రాంతికి రావడం కష్టమే అనే మాటలు వినిపిస్తున్నాయి.