https://oktelugu.com/

Rakul Preet Singh: మరో వ్యాపారం మొదలు పెట్టిన స్టార్ హీరోయిన్ !

Rakul Preet Singh: క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. మోడలింగ్ తో తన కెరీర్ ను ప్రారంభించిన రకుల్ ప్రీత్ తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి ఎందరో అభిమానులను కూడగట్టుకుంది. ఇప్పటికే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. మొత్తానికి ఈ బ్యూటీ అక్కడా వరుస ఆఫర్ లతో దూసుకుపోతూ అక్కడ కూడా సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : June 30, 2022 / 02:52 PM IST
    Follow us on

    Rakul Preet Singh: క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. మోడలింగ్ తో తన కెరీర్ ను ప్రారంభించిన రకుల్ ప్రీత్ తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి ఎందరో అభిమానులను కూడగట్టుకుంది. ఇప్పటికే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. మొత్తానికి ఈ బ్యూటీ అక్కడా వరుస ఆఫర్ లతో దూసుకుపోతూ అక్కడ కూడా సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

    Rakul Preet Singh

    కానీ, హిందీ తెర పై రకుల్ అందాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. కాకపోతే, ఒకానొక దశలో ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ‘కాబోయే మోస్ట్ పాపులర్ పాన్ ఇండియా హీరోయిన్’ ఎవరు అని సర్వే చేస్తే.. రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా టాప్ లో నిలిచింది. రకుల్ అలా నిలిచిందంటే ఆమె రేంజ్ అక్కడ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

    Also Read: Ballaya-Nagarjuna Daughter-in-law: బాలయ్య కి జోడిగా నాగార్జున కోడలు.. షాక్ లో ఫాన్స్

    ఇక తన సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్, ఈ మధ్య రెగ్యులర్ గా వార్తల్లో కనిపించడం లేదు. అయితే, చాలా రోజుల తర్వాత అమ్మడు హెడ్ లైన్స్ లో నిలిచింది. అయితే ఈసారి తన సినిమాలకు సంబంధించిన విషయాలతో కాదు, ఒక పర్సనల్ మ్యాటర్ కి సంబంధించి రకుల్ హాట్ టాపిక్ అయ్యింది.

    ఆమె ముంబైలో కొత్త వ్యాపారం పెట్టబోతోంది. ముంబైలో బాత్రా అనే ఏరియాలో అమ్మడు ఓ రెస్టారెంట్ ఓపెన్ చేయబోతుంది. ఈ రెస్టారెంట్ కి ఒక స్పెషల్ ఉందట. అన్నీ సౌత్ స్పెషల్ ఐటమ్స్ ఈ రెస్టారెంట్ లో హైలైట్ గా ఉంటాయట. రకుల్ కి వ్యాపారం కొత్త ఏమి కాదు, ఆమె ఇప్పటికే జిమ్ సెంటర్స్ పెట్టింది. అలాగే బట్టల వ్యాపారంలో కూడా ఆమెకు వాటాలు ఉన్నాయని టాక్.

    Rakul Preet Singh

    పైగా కొన్ని కంపెనీలకు రకుల్ ప్రీత్ సింగ్ బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తోంది. మొత్తమ్మీద రకుల్ ప్రీత్ సింగ్ కి సినిమాలు తగ్గగానే, బిజినెస్ చేయాలని ఆలోచన రావడం ఆమె తెలివికి నిదర్శనం. మరి రకుల్ ప్రీత్ సింగ్ ఈ వ్యాపారంలోనూ సక్సెస్ కావాలని కోరుకుందాం.

    Also Read:Sreeleela: మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన ప్లాప్ హీరోయిన్ !

    Tags