Mahesh Babu Remuneration: ఇదీ మహేష్ బాబు రేంజ్.. త్రివిక్రమ్ సినిమాకు రెమ్యునరేషన్ రెట్టింపు.. ఎంతో తెలుసా ?

Mahesh Babu Remuneration: సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. రీసెంట్ గానే త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. అయితే, ఈ సినిమాలో మహేష్ రెమ్యునరేషన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. సహజంగానే టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. అయితే ఈ సినిమాకు మహేష్ తన పారితోషికాన్ని పెంచాడు. మహేష్ […]

Written By: Shiva, Updated On : July 1, 2022 3:33 pm

Mahesh Babu, Trivikram

Follow us on

Mahesh Babu Remuneration: సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. రీసెంట్ గానే త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. అయితే, ఈ సినిమాలో మహేష్ రెమ్యునరేషన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. సహజంగానే టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. అయితే ఈ సినిమాకు మహేష్ తన పారితోషికాన్ని పెంచాడు. మహేష్ అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు కూడా ముందుకు వచ్చారు.

mahesh babu, trivikram

ఈ సినిమా కోసం మహేష్.. 60 రోజుల పాటు కాల్ షీట్స్ ఇచ్చాడని, రూ.53 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోనున్నారని తెలుస్తోంది. అలాగే మరో 7 కోట్లు సినిమా హిట్ అయ్యాక ఇస్తారట. అంటే మహేష్ రెమ్యునరేషన్ రోజుకు రూ. కోటి అన్న మాట. రీసెంట్ గానే త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ భారీ యాక్షన్ డ్రామాలో మహేష్ పాత్ర వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందట.

Also Read: Rakul Preet Singh: మరో వ్యాపారం మొదలు పెట్టిన స్టార్ హీరోయిన్ !

అలాగే, ఈ చిత్రంలో మరో కీలక పాత్ర ఉందని, ఆ పాత్రలో నందమూరి తారక రత్న నటిస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. సినిమాలో తారక రత్న పాత్ర విషయానికి వస్తే.. మహేష్ కి బావ పాత్ర అట. పైగా ది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అట. ఎప్పటి నుంచో తారక రత్న సైడ్ క్యారెక్టర్స్ కోసం పడిగాపులు కాస్తున్నాడు. కాకపోతే.. ఓ మంచి రోల్ కోసం ఇన్నాళ్లు ఎదురుచూశాడు.

mahesh babu trivikram

మరి, త్రివిక్రమ్ సినిమాలో సైడ్ క్యారెక్టర్ కి కూడా విలువ ఉంటుంది కాబట్టి.. తారక రత్నకి కాలం కలిసి వస్తోందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఆగస్టు నుంచి షూట్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాలో యాక్షన్ అండ్ రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తామని, ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడు.

పైగా ఈ సినిమాలో రెండు బలమైన నేపథ్యాలు కూడా ఉంటాయట. ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఒకటి కాగా, పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యం మరొకటి. ఈ సినిమాకి రూ.200 కోట్లు కనీస బడ్జెట్ అయ్యేలా ఉంది. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది.

Also Read:Sreeleela: మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన ప్లాప్ హీరోయిన్ !

Tags