Dil Raju Naga Vamsi clash: ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిపోయిన పేరు దిల్ రాజు(Dil Raju). ఒకప్పుడు దిల్ రాజు పేరు ఎత్తితే ఆయన నిర్మించిన అద్భుతమైన సినిమాలే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు దిల్ రాజు పేరు ఎత్తితే మన అందరికీ వివాదాలే గుర్తుకు వస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈయన బ్యానర్ నుండి విడుదలైన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘గేమ్ చేంజర్’ భారీ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం, ఆ ఫ్లాప్ గురించి ఇంటర్వ్యూస్ లో పదే పదే గుర్తు చేస్తూ రామ్ చరణ్ అభిమానులకు చిరాకు రప్పించడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం వంటివి మనమంతా చూశాము. ఇక ఆయన కెరీర్ విషయానికి గేమ్ చేంజర్ నష్టాలను ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం పూడ్చినా, రీసెంట్ గా విడుదలైన ‘తమ్ముడు’ చిత్రం తో మరో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్నాడు.
Also Read: విక్రమ్ ‘నాన్న’ లో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఎంత పెద్ద హీరోయిన్ అయ్యిందో చూస్తే ఆశ్చర్యపోతారు!
సుమారుగా 70 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఈ సినిమా కోసం ఖర్చు చేసాడట. ఇదంతా పక్కన పెడితే దిల్ రాజు కి ఇప్పటికే ‘మైత్రీ మూవీ మేకర్స్'(Mythri Movie Makers) తో శత్రుత్వం మొదలైంది. ఈ విషయాన్నీ స్వయంగా దిల్ రాజు సోదరుడు శిరీష్ రీసెంట్ ఇంటర్వ్యూ లో ఒప్పుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ని నక్క తో పోల్చిన శిరీష్, నాగ వంశీ(Naga Vamsi) ని నాగలోకం తో పోల్చాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే నాగవంశీ కూడా దిల్ రాజు కి నక్క లాగా మారిపోబోతున్నాడు. నాగవంశీ కి సంబందించిన ప్రతీ సినిమాని నిన్న మొన్నటి వరకు నైజాం ప్రాంతం లో దిల్ రాజు కి ఇస్తూండేవాడు. కానీ ఇప్పుడు ఆయన తన మనసుని మార్చుకున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ తో చేతులు కలిపి,ఇక నుండి తన సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి విడుదలయ్యే ప్రతీ సినిమా నైజాం ప్రాంతం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట.
Also Read: మహేష్ బాబు,రాజమౌళి చిత్రానికి సరికొత్త చిక్కులు..ఇలా అయితే కష్టమే!
ప్రస్తుతం నాగవంశీ చేతిలో ‘కింగ్డమ్‘, ‘వార్ 2‘ మరియు ‘మాస్ జాతర‘ చిత్రాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాల నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ కి ఇవ్వనున్నారట. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి,మరో రెండు మూడు రోజుల్లో ఖరారు కానుంది. రీసెంట్ గా నాగవంశీ కి దిల్ రాజు కి మధ్య ఈగో సమస్యలు రావడం వల్లే అతని నుండి దూరంగా జరిగిపోయాడని టాక్ వినిపిస్తుంది. దానికి తోడు నాగవంశీ పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు. దిల్ రాజు పై రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనల కారణంగా పవన్ కళ్యాణ్ చాలా కోపం తో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహా మేరకే నాగవంశీ దిల్ రాజు తో బంధం కట్ చేసుకున్నాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. త్వరలో విడుదల అవ్వబోయే పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం కూడా నైజాం ప్రాంతం లో మైత్రీ మూవీ మేకర్స్ నే విడుదల చేయబోతుంది.