Hero Vikram Nanna Movie: బాలనటులుగా నటించిన ఎంతో మంది నటీనటులు నేడు పెద్దవారై హీరోలు గా, హీరోయిన్స్ గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉంటున్నారు. చాలా మందికి వీళ్ళు గతం లో చైల్డ్ ఆర్టిస్ట్స్ గా చేశారు అనే విషయం తెలియదు. తెలిసినప్పుడు ‘అవునా..నిజమా’ అని ఆశ్చర్యపోతుంటాము. అలాంటి నటి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ప్రముఖ తమిళ హీరో విక్రమ్(Chiyaan Vikram) గతంలో ‘నాన్న’ అనే చిత్రం చేశాడు గుర్తుందా?, ఇందులో ఆయన నట విశ్వరూపం చూపించాడు. నేషనల్ అవార్డు కూడా వచ్చింది. కమర్షియల్ గా కూడా అటు తమిళంలోనూ,ఇటు తెలుగులోనూ పెద్ద హిట్ అయ్యింది. ఇందులో విక్రమ్ కూతురుగా నటించిన అమ్మాయి కూడా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ని రాబట్టింది. ఈ అమ్మాయి పేరు సారా అర్జున్(Sara Arjun). ఈమె ప్రముఖ నటుడు రాజ్ అర్జున్(Raj Arjun) కూతురు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ చిత్రం తర్వాత ఆమె అనేక సినిమాల్లో నటించింది.
Also Read: మహేష్ బాబు,రాజమౌళి చిత్రానికి సరికొత్త చిక్కులు..ఇలా అయితే కష్టమే!
ఇప్పుడు పెద్దయ్యాక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్(Ranveer Singh) నటించిన దురంధర్(Dhurandar Movie) అనే చిత్రం లో సారా అర్జున్ ఒక కీలక పాత్ర పోషించింది. నిన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అవ్వగా,అందులో రణవీర్ సింగ్ ఈమెని ఎత్తుకొని తిరుగుతూ ఉండే షాట్ బాగా హైలైట్ అయ్యింది. అందులో కనిపించింది ఎవరు అని ఆరాలు తియ్యగా ఆమె సారా అర్జున్ అని తెలిసింది. ఈమెకు ఇది పెద్దయ్యాక మొదటి సినిమా కాదు. తెలుగు లో ఈమె రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో కనిపించిన ‘దాగుడు మూతలా దండాకోర్’ చిత్రం లో నటించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ కి మానవరాలిగా ఎంతో అద్భుతమైన నటన కనబర్చింది. అంతకు ముందు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన జైహో, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్ర పోషించిన జజ్బా , శాండ్ కీ ఆంఖ్ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది.
Also Read: లంచ్ లోకి మటన్ తీసుకురాలేదని షూటింగ్ ఆపేసిన నటుడు.. వైరల్ వీడియో…
వీటితో పాటు ప్రముఖ ప్రొడక్ట్స్ మ్యాగీ,మేక్ డొనాల్డ్స్ లతో పాటు కళ్యాణ్ జ్యువెలర్స్, క్లినిక్ ప్లస్ వంటి సంస్థలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. అంతే కాదు ఈమెకు ఒక అరుదైన రికార్డు కూడా ఉంది. కేవలం 18 ఏళ్ళ వయస్సులో 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకున్న ఏకైక హీరోయిన్ గా నిల్చింది. 2022 వ సంవత్సరం లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం ఎంత పెద్ద కమర్షియల్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ చిన్ననాటి క్యారక్టర్ ని పోషించి కోట్లాది మంది దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఇప్పుడు ఈమె వయస్సు కేవలం 20 ఏళ్ళు మాత్రమే. 40 ఏళ్ళ హీరో రణవీర్ తో కలిసి నటిస్తుంది. ఈ ‘దురంధర్’ చిత్రం సారా అర్జున్ కి గేమ్ చేంజర్ గా మారుతుందో లేదో చూడాలి.