Homeఎంటర్టైన్మెంట్OKTelugu MovieTime: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్

OKTelugu MovieTime: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్

OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ లపై చీటింగ్ కేసు నమోదైంది. “హౌరా బ్రిడ్జ్” సినిమా కోసం దాదాపుగా రూ.84 లక్షలు తీసుకున్నారని, ఆ హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని నిర్మాత శరన్ కుమార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన డబ్బు తిరిగి ఇవ్వకపోగా..తన కాల్‌లను కూడా లిఫ్ట్ చేయడం లేదని ఫిర్యాదు చేసారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు FIR నమోదు చేసారు.

bellamkonda srinivas
bellamkonda srinivas

మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. కన్నడ సూపర్ స్టార్ హీరో ఉపేంద్ర ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. ఉపేంద్ర తాజాగా మరో పాన్ ఇండియా మూవీని ప్రకటించారు. ఈ చిత్రంలో లహరి మ్యూజిక్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది. లహరి ఫిలింస్ ఎల్ ఎల్ పీ వీనస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘యూ’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

Also Read:  మహేష్ బాబు’ మరదలిగా ప్రముఖ హీరో కుమార్తె

upendra
upendra

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. ఈ చిత్రాన్ని పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 17న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీని హీరో శ్రీకాంత్, విజయ్ ఎమ్‌ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో 17న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Puneeth Rajkumar James
Puneeth Rajkumar James

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘ది ఘోస్ట్’ సినిమా షూటింగ్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ మొదలైంది. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్‌లో నాగార్జున, హీరోయిన్ సోనాల్ చౌహాన్‌పై సన్నివేశాలను దుబాయ్‌లో చిత్రీకరిస్తున్నారు. తొలుత ఈ సినిమాలో కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకోగా.. కొద్దిరోజుల షూటింగ్ తర్వాత ప్రెగ్నెన్సీ వల్ల ఆమె తప్పుకుంది. తర్వాత సోనాల్‌ను ఎంపిక చేశారు. ఈ సినిమాలో సీక్రెట్ ఏజెంట్‌గా నాగ్ కనిపించనున్నాడు.

Also Read: ‘రాధేశ్యామ్’ మూవీలో అద్భుత హైలెట్స్.. ప్రధాన లోపాలేంటో తెలుసా?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

2 COMMENTS

  1. […] Sonali Bendre: వెండితెర పై తమ అభినయంతో ప్రేక్షకులకు కనువిందు కలిగించే అందాల తారల వెనుక బాధాకరమైన అనారోగ్య సమస్యలుంటాయి. వారికీ చెప్పుకోలేని చాలా బాధలు ఉంటాయి. అయితే, నిత్యం అందం కోసం యోగాలు, ఫిట్నెస్ మంత్రాలు వల్లించే హీరోయిన్ కూడా ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడటం.. సినీ లోకాన్నే షాక్ కి గురి చేసింది. అయితేనేం.. ఆమె ఆ బాధల వలయంలో నుంచి త్వరగా బయట పడింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular