Rashmi Gautam: హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతుంది. ఆమె మాటల్లో లొసుగులు ఉండవు. ఏదైనా డైరెక్ట్ గానే చెబుతుంది. బుల్లితెర పై హాట్ యాంకర్ గా రష్మీ గౌతమ్ కి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అయితే, ఆమె తాజాగా సినీ పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తింది. టాప్ పొజిషన్ కు చేరుకోవడానికి ఆమె ఖచ్చితంగా పడుకుని వుంటుందని అంటుంటారు అంటూ సాగే ఒక మీమ్‌ని షేర్ చేస్తూ.. “అవును..చాలామందికి ఇలా అనడం సులభం” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక రష్మీ గౌతమ్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఆమెకు టీవీ షోలలో అవకాశాలు ఉన్నప్పటికీ, సినిమాల్లో మాత్రం ఈ బ్యూటీని పెద్దగా పట్టించుకోవడం లేదు. చివరకు అనసూయకి వస్తోన్న ఐటమ్ సాంగ్స్ కూడా రష్మీకి రావాడం లేదు. ఎప్పటికప్పుడు ఈ అమ్ముడు తన నటనా ప్రదర్శనను పెంచుకుంటూ పోతుంది.
Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్
అయినా ఎందుకో.. మూవీ మేకర్స్ మాత్రం రష్మీలో హీరోయిన్ ను చూడలేకపోతున్నారు. అందుకే రష్మీ గౌతమ్ ఇక పూర్తిగా సినిమాలకు టాటా చెప్పిందట. కొత్తగా కొన్ని చిన్న సినిమాలు వస్తోన్నా.. ఆమె ఏవీ ఒప్పుకోవడం లేదట. తానూ ఇక పూర్తిగా టీవీ కెరీర్ పైనే ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిందట. నిజానికి “గుంటూరు టాకీస్” సినిమాతోనే రష్మీ హీరోయిన్ గా సక్సెస్ అయింది. పైగా ఆ సినిమాతో యూత్ లో సెక్స్ సింబల్ ఇమేజ్ ను కూడా పొందింది.

ఆ తరువాత రష్మీకి చెప్పుకోతగ్గ సినిమా మళ్ళీ రాలేదు. వచ్చినా చిన్నాచితకా అరడజన్ సినిమాలు కూడా ఆమె కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడకపోగా, పూర్తిగా డ్యామేజ్ చేశాయి. మొత్తానికి ఈ మధ్య రష్మీకి ఫుల్ క్లారిటీ వచ్చిందట. ఇలాగే ఊరు పేరు లేని సినిమాలు చేస్తే టీవీ కెరీర్ కూడా పోతుందనే భయం పుట్టిందట. ఎలాగూ తనకు పెద్దగా సినిమా ఆఫర్లు రావనే విషయం తెలుసు.
పోనీ అనసూయకు వస్తోన్న ఐటెం సొంగులు, స్పెషల్ రోల్స్ కూడా తనకు రావు. అందుకే రష్మీ ఇక బుల్లితెరకు మాత్రమే పరిమితం అవ్వాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండటానికి తరచుగా ఫోటో షూట్లు చేస్తూ పోతుంది.
Also Read: మహేష్ బాబు’ మరదలిగా ప్రముఖ హీరో కుమార్తె
[…] […]
[…] Lavanya Tripathi: హోమ్లీ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది హీరోయిన్ ‘లావణ్య త్రిపాఠి’. అందుకే, ఆమెకు స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఛాన్స్ లు రాలేదు అని ఒక టాక్ ఉంది. అందుకే, ఇక లావణ్య త్రిపాఠి తన రూట్ మార్చాలని నిర్ణయం తీసుకుందని.. ట్రెండ్ కి తగ్గట్టు.. కాస్త బోల్డ్ క్యారెక్టర్స్ కూడా చేయాలని లావణ్య త్రిపాఠి ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుంది. అసలు తానూ మంచి గ్లామర్ బ్యూటీని అని, అలాగే మంచి నటిని కూడా అని.. అయినా తనకు అవకాశాలు ఎందుకు ఇవ్వరు అని లావణ్య త్రిపాఠి బాగా ఫీల్ అవుతుందట. […]