MLA Ganta Srinivasa Rao : ఏపీలో( Andhra Pradesh) ప్రజాప్రతినిధులు సంయమనం పాటించడం లేదు. ప్రజాక్షేత్రంలో వారు అసహనానికి గురవుతూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండు రోజుల కిందట ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు లో పర్యటించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసుల బట్టలూడదీసి నిలబెడతాము అంటూ హెచ్చరించారు. దీనిపై పోలీసు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి పై అవసరం అనుకుంటే న్యాయ పోరాటం చేస్తామని కూడా పోలీస్ అధికారుల సంఘం ప్రకటించింది. అయితే తాజాగా విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తిట్ల పురాణం అందుకున్నారు. అది కూడా ఒక మున్సిపల్ ఉద్యోగిపై. అందరూ చూస్తుండగానే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాస్కెల్ అంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వైరల్ అంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన మాదిరిగానే గంటా శ్రీనివాసరావును ప్రశ్నించే దమ్ము ఉద్యోగుల సంఘం నేతలకు ఉందా అంటూ వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Also Read : నేషనల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్.. ఆకట్టుకుంటున్న జనసేన వీడియో!
* రాస్కెల్ అంటూ ఆగ్రహం..
గంటా శ్రీనివాసరావు( Ghanta Srinivas Rao ) భీమిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నియోజకవర్గ పరిధిలోని ఎండాడలో పారిశుధ్యం తో పాటు తాగునీటి సమస్యపై స్థానికులు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. డివిజన్ విజిట్ లో భాగంగా ఆయన ఎండాడకు వెళ్ళగా స్థానికులు చుట్టుముట్టారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యారు గంటా శ్రీనివాసరావు. అక్కడే ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ రవి పై నోటి దురుసు ప్రదర్శించారు. పళ్ళు రాలగొడతా రాస్కెల్ అంటూ తిట్లు అందుకున్నారు. గాడిదలు కాస్తున్నారా? కళ్ళు కనిపించడం లేదా? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా లేవంటూ స్థానికులు ఎమ్మెల్యేను నిలదీయడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఒక్కసారిగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అలా తిట్లు అందుకునేసరికి అధికారిక, ఉద్యోగ వర్గాల్లో ఒక రకమైన విమర్శలు వచ్చాయి.
* పారిశుద్ధ్య కార్మికుల నిరసన..
గత కొద్ది రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మునిసిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని చంద్రబాబు( Chandrababu) హామీ ఇచ్చారు. పది నెలలు అవుతున్న ఆ హామీ అమలుకు నోచుకోలేదు. ఈ తరుణంలో జీవీఎంసీ కి చెందిన పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. కానీ బయటకు రాలేదు. కార్మికులు గంటల తరబడి నిరీక్షించారు. చివరకు గంటా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే అప్పటి నుంచి మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల విషయంలో ఆగ్రహంగా ఉన్నారు గంటా శ్రీనివాసరావు. ఈ నేపథ్యంలోనే శానిటరీ ఇన్స్పెక్టర్ పై చిందులు తొక్కినట్లు తెలుస్తోంది.
* స్పందించిన పోలీస్ అధికారుల సంఘం..
రెండు రోజుల క్రితం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) పోలీసుల పనితీరుపై మాట్లాడారు. కూటమికి కొమ్ముకాస్తున్న పోలీస్ అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వెనువెంటనే పోలీస్ అధికారుల సంఘం స్పందించింది. కానీ విశాఖలో అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారులపైనే బహిరంగంగా తిట్ల దండకం అందుకున్నారు. కానీ ఒక్కరంటే ఒక్క ఉద్యోగి సంఘం నేత కూడా దీనిపై స్పందించలేదు. దీనిపై ఉద్యోగ వర్గాల్లో ఒక రకమైన విమర్శ వ్యక్తమవుతోంది. రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
జగన్‌పై కేసులు పెట్టారు… ఈ ఎమ్మెల్యే గారిపై కూడా కేసులు పెడతారా? ప్రెస్ మీట్లూ పెడతారా?”
పబ్లిక్‌గా ‘పళ్ళు రాలగొడతా రాస్కెల్’ అంటూ ప్రభుత్వ ఉద్యోగిపై రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.
అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ఏం తిట్టినా ఉద్యోగ సంఘాలు పెద్దగా… pic.twitter.com/HQJzgJb3VI
— greatandhra (@greatandhranews) April 10, 2025