Celebrities: సినీ విషాదాల మయం : 2020 – 21లో కన్నుమూసిన సినీ ప్రముఖులు వీళ్ళే !

Celebrities: సినీ పరిశ్రమ విషాదాల మయం అయిపోయింది. వరుస విషాదాలు వెంటాడుతుంటే.. భరించలేక తల్లడిల్లిపోతుంది. సినిమా అంటే సరదా. సినిమా వాళ్ళు అంటే మనవాళ్ళు. అందుకే, సినిమా పరిశ్రమలోని విషాదాలకు ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అదేంటో ఎప్పుడు లేనిది గత సంవత్సర కాలంగా ఫీల్మ్ ఇండస్ట్రీ చేదు వార్తలతో సతమతమవుతుంది. వయసుతో సంబంధం లేదు, ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న కొందరు సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం వర్ణించలేని దుఃఖ సాగర సారాంశం అయిపోయింది. […]

Written By: Shiva, Updated On : December 1, 2021 1:23 pm
Follow us on

Celebrities: సినీ పరిశ్రమ విషాదాల మయం అయిపోయింది. వరుస విషాదాలు వెంటాడుతుంటే.. భరించలేక తల్లడిల్లిపోతుంది. సినిమా అంటే సరదా. సినిమా వాళ్ళు అంటే మనవాళ్ళు. అందుకే, సినిమా పరిశ్రమలోని విషాదాలకు ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అదేంటో ఎప్పుడు లేనిది గత సంవత్సర కాలంగా ఫీల్మ్ ఇండస్ట్రీ చేదు వార్తలతో సతమతమవుతుంది.

Celebrities

వయసుతో సంబంధం లేదు, ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న కొందరు సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం వర్ణించలేని దుఃఖ సాగర సారాంశం అయిపోయింది. ఈ కరోనా మహమ్మారి దెబ్బకు ఎంతగానో నష్టపోయిన సినీ కళామతల్లి .. ముత్యాల్లాంటి తన బిడ్డలను కూడా కోల్పోయింది. అనారోగ్య సమస్యలతో కొందరు, అకాల మరణంతో మరికొందరు వెళ్లిపోయారు.

వారి మరణాలు చూసి సినీలోకంతో పాటు ప్రేక్షకులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కేవలం రెండు రోజుల తేడాతో ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కన్నుమూయగా.. నిన్న సాయంత్రం పాటల సారథి సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా తుదిశ్వాస విడిచి తెలుగు పాటను అనాధను చేసి వెళ్లిపోయారు. ఈ 2020-21 సినిమా ఇండస్ట్రీకి అసలు కలిసి రాలేదు. ఎందర్నో ఈ ఏడాది మనకు లేకుండా చేసింది.

ఈ 2020 – 21లో కన్నుమూసిన సినీ ప్రముఖులు..

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం.. సెప్టెంబర్ 25న అనారోగ్యంతో మరణించారు.

ఆర్ ఆర్ వెంకట్ (57 సంవత్సరాలు).. నిర్మాత.. సెప్టెంబర్ 27న మరణించారు.

కేవీ ఆనంద్ (54 సంవత్సరాలు).. దర్శకుడు, సినిమాటోగ్రఫర్.. ఏప్రిల్ 30న మరణించారు.

బీఏ రాజు (62 సంవత్సరాలు).. నిర్మాత, జర్నలిస్ట్.. మే 23న మరణించారు.

వివేక్ (60 సంవత్సరాలు).. పాపులర్ త‌మిళ న‌టుడు.. ఏప్రిల్ 17 గుండెపోటుతో..

మహేశ్‌ కోనేరు (40 సంవత్సరాలు).. నిర్మాత.. అక్టోబర్ 12న మరణించారు..

సిద్ధార్థ్ శుక్లా (40 సంవత్సరాలు).. మోడల్ కమ్ నటుడు.. సెప్టెంబర్ 2న గుండెపోటుతో

టీఎన్ ఆర్.. జర్నలిస్ట్ కమ్ నటుడు.. మే 10న కరోనాతో..

మహేశ్‌ కత్తి (45 సంవత్సరాలు).. జర్నలిస్ట్ కమ్ నటుడు.. జులై 10 యాక్సిడెంట్..

పునీత్ రాజ్‌కుమార్ (46 సంవత్సరాలు).. కన్నడ పవర్ స్టార్ హీరో.. అక్టోబర్ 29న గుండెపోటుతో.

శివ శంకర్ మాస్టర్ (72 సంవత్సరాలు).. కొరియోగ్రాఫర్.. నవంబర్ 28న అనారోగ్యంతో..

సిరివెన్నెల సీతారామశాస్త్రి (66 సంవత్సరాలు).. పాటల రచయిత.. నవంబర్ 30న అనారోగ్యంతో మరణించారు.

Tags