https://oktelugu.com/

Sirivennela: మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు

Sirivennela: ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్​లోనీ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హిందూ సంప్రదాయ పద్దతిలోనే ఆయన కుటుంబ సభ్యులు అత్యక్రియలు చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం 1గంటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అత్యక్రియలు జరగనున్నాయి. ఫిల్మ్ ఛాంబర్​ నుంచి మహా ప్రస్థానం వరకు సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతిమయాత్ర జరగనుంది. ఈ అంతిమయాత్రలో టాలీవుడ్​ సినీ ప్రముఖులు, అభిమానులు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 1, 2021 / 12:09 PM IST
    Follow us on

    Sirivennela: ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్​లోనీ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హిందూ సంప్రదాయ పద్దతిలోనే ఆయన కుటుంబ సభ్యులు అత్యక్రియలు చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

    కాగా, ఇవాళ మధ్యాహ్నం 1గంటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అత్యక్రియలు జరగనున్నాయి. ఫిల్మ్ ఛాంబర్​ నుంచి మహా ప్రస్థానం వరకు సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతిమయాత్ర జరగనుంది. ఈ అంతిమయాత్రలో టాలీవుడ్​ సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొననున్నారు. కాగా, ఫిల్మ్​ఛాంబర్​లో సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతదేహానికి పులువురు సినీ తారలు నివాళులు అర్పించారు. కాసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, రానా , నాగార్జున, వెంకటేశ్​ తదితరులు సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. తాజాగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్​ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కడసారి చూసేందుకు వచ్చారు.

    Sirivennela

    Also Read: మన రాకలు, పోకలు మన చేతుల్లో ఉండవు – సిరివెన్నెల సీతారామశాస్త్రి

    ఈ క్రమంలోనే త్రివిక్రమ్​ను ఓదార్చారు.  కాసేపు అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి భౌతికగాయాన్ని చూస్తూ ఉండిపోయారు. మరోవైపు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఆయన లేని లోటును వ్యక్తపరచడానికి కూడా మాటలు చాలట్లేదని భావోద్వేగంతో మాట్లాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బహుశా ఈ ఆవేదనను ఆయన తన కలంతోనే వ్యక్తపరిస్తే బాగుండేందని ఎమోషనల్​ అయ్యారు. సీతారామశాస్త్రి గారి కలం ఆగినా.. ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన పాటలు, అక్షరాలు, తెలుగు జాతి, తెలుగు భాష బతికున్నంత కాలం అలా చిరస్మరణీయంగా నిలిచిపోతుందని అన్నారు.

    Also Read: ఆయన లేని బాధను వ్యక్తపరచడానికి మాటలు కూడా చాలట్లేదు- ఎన్టీఆర్