https://oktelugu.com/

Sirivennela: త్రివిక్రమ్​ను ఓదార్చిన పవన్​కళ్యాణ్​.. సిరివెన్నెల భౌతికగాయానికి నివాళి

Sirivennela: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల మృతితో సినీ ఇండస్ట్రీ శోసంద్రంలో మునిగిపోయింది. ఆయన లేని లోటును తీర్చేదెవరంటూ సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మృతదానికి నివాళులు అర్పించేందుకు సినీ స్టార్స్​తో పాటు అభిమానులు ఫిల్మ్​ ఛాంబర్​ వద్దకు తరలి వస్తున్నారు. కాగా, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పార్థిస్తున్నారు. కాసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, రానా , నాగార్జున, వెంకటేశ్​ తదితరులు సిరివెన్నెలకు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 1, 2021 / 12:00 PM IST
    Follow us on

    Sirivennela: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల మృతితో సినీ ఇండస్ట్రీ శోసంద్రంలో మునిగిపోయింది. ఆయన లేని లోటును తీర్చేదెవరంటూ సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మృతదానికి నివాళులు అర్పించేందుకు సినీ స్టార్స్​తో పాటు అభిమానులు ఫిల్మ్​ ఛాంబర్​ వద్దకు తరలి వస్తున్నారు. కాగా, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పార్థిస్తున్నారు. కాసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, రానా , నాగార్జున, వెంకటేశ్​ తదితరులు సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. తాజాగా పవన్ కళ్యాణ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కడసారి చూసేందుకు వచ్చారు. మరికొద్దిసేపట్లో ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. సిరివెన్నెల నిర్జీవంగా ఉండటాన్ని చూసి మౌనంగా ఉండిపోయారు పవన్ కళ్యాణ్​.

    Sirivennela

    Also Read: మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు
    ఈ క్రమంలోనే త్రివిక్రమ్​ను ఓదార్చారు.  కాసేపు అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి భౌతికగాయాన్ని చూస్తూ ఉండిపోయారు. పవన్​ కల్యాణ్​పై సిరివెన్నెలకు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్​ నటించిన చాలా సినిమాలకు ఆయన అనేక పాటలు రాశారు. దీంతో పాటు కార్యక్రమంలో పవన్ గురించి మాట్లాడుతూ.. ఆయనొక శిఖరమని.. ఆయన ఆలోచనలు, ఆచనరణలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని సిరివెన్నెల కొనియాడారు. అలాంటి సన్నిహిత సంబంధం ఇద్దరి మధ్య ఉండేది.

    కాగా, పవన్​తో పాటు, ఎన్టీఆర్ కూడా సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించారు. ఆయన లేని లోటును వ్యక్తపరచడానికి కూడా మాటలు చాలట్లేదని భావోద్వేగంతో మాట్లాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

    Also Read: సిరివెన్నెల గారు మనల్ని వదిలివెళ్ళడం ఎంతో బాధాకరం: రాజమౌళి