https://oktelugu.com/

Tollywood: నేటి ఎక్స్ క్లూజివ్ సినిమా కబుర్లు !

నేటి టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. ‘ఉప్పెన’ బారీ హిట్ కొట్టిన కృతిశెట్టి ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలలో నటిస్తోంది. కాగా తాజాగా ఆమె అల్లు అర్జున్ ‘ఐకాన్’ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఒకరు పూజ హెగ్డే కాగా, రెండో హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తోంది. నేషనల్ స్టార్ ప్రభాస్ ఈ రోజు నుంచి ‘ఆదిపురుష్’ షూటింగులో పాల్గొన్నాడు. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ […]

Written By:
  • admin
  • , Updated On : September 11, 2021 / 12:12 PM IST
    Follow us on

    నేటి టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. ‘ఉప్పెన’ బారీ హిట్ కొట్టిన కృతిశెట్టి ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలలో నటిస్తోంది. కాగా తాజాగా ఆమె అల్లు అర్జున్ ‘ఐకాన్’ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఒకరు పూజ హెగ్డే కాగా, రెండో హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తోంది.

    నేషనల్ స్టార్ ప్రభాస్ ఈ రోజు నుంచి ‘ఆదిపురుష్’ షూటింగులో పాల్గొన్నాడు. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తన లుక్ కోసం యూకేకు వెళ్ళబోతున్నాడు.

    మావీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’కు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్ రాజ్ తో పాటు మంచు విష్ణు కూడా పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు బాబూమోహన్ కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

    ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో వస్తున్న ‘ఆచార్య’ సినిమా రిలీజ్ పై ఇంకా మేకర్స్ ఒక నిర్ణయానికి రాలేదు. వినాయక చవితికి స్పెషల్ గా ‘ఆచార్య’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాలని ప్లాన్ చేసినా.. ఏపిలో టికెట్ రేట్లు పై స్పష్టత రాకపోవడంతో సినిమాని వాయిదా వేస్తున్నారు.

    నట సింహం బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఈ నెల 23వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యుల్ లో బాలయ్యతో పాటు మిగిలిన టీం కూడా పాల్గొంటారట.