Nissan Cars: ప్రముఖ వాహన తయారీ సంస్థలలో ఒకటైన నిస్సాన్ సంస్థ కొత్త కారును కొనుగోలు చేసేవాళ్లకు తీపికబురు అందించింది. కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కారు కొనుగోలుపై ఈ సంస్థ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ కారును కొనుగోలు చేయడం ద్వారా లక్ష రూపాయల క్యాష్ డిస్కౌంట్ తో పాటు ఇతర ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ నెల 30వ తేదీలోగా కారును కొనుగోలు చేసిన వాళ్లు ఈ ఆఫర్ కు అర్హులని చెప్పవచ్చు.
వినాయక చవితి పండుగ సందర్భంగా నిస్సాన్ సంస్థ ఈ ఆఫర్ ను ప్రకటించింది. నిస్సాన్ కిక్ ఎస్‌యూవీ కొనుగోలు చేయడం ద్వారా 2 గ్రాముల బంగారం కూడా పొందే అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్ రాష్ట్రాలలోని డీలర్ షిప్ సెంటర్ల ద్వారా కారును కొనుగోలు చేస్తే మాత్రమే ఈ ఆఫర్ కు అర్హత పొందవచ్చు. నిస్సాన్ కిక్ఎస్యూవీ కారు ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
రెండు వేరియంట్లపై లక్ష రూపాయల వరకు క్యాష్ బెనిఫిట్, ఆన్ లైన్ బుకింగ్ బోనస్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. నిస్సాన్ కంపెనీ ఈ కారును కొనుగోలు చేసిన వాళ్లకు 7.99% వడ్డీ రేటుకే కార్లోన్ పొందే విధంగా ఒప్పందం చేసుకోవడం గమనార్హం. రెండు వేరియంట్లకు నిస్సాన్ సంస్థ ఒకే తరహా ప్రయోజనాలను అందిస్తుండటం గమనార్హం.
నిస్సాన్ కిక్స్ మొత్తం రెండు పెట్రోల్ ఇంజిన్ల ఆప్షన్లతో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 5 -స్పీడ్ మాన్యువల్, 6 -స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ ఆప్షన్లతో ఈ కారు అందుబాటులో ఉంది. మన దేశ మార్కెట్ లో ఈ కారు ధర రూ. 9.5 లక్షల నుంచి రూ. 14.65 లక్షల రూపాయల మధ్య ఉంది.