వెలువడుతున్న నివేదికలను బట్టి అక్టోబర్ నెలలో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. గ్యాస్ సిలిండర్ ధరలు మరింత పెరిగితే సామాన్యులపై మరింత భారం పెరిగే అవకాశాలు ఉంటాయి. 2014 సంవత్సరం నుంచి కొత్త డొమెస్టిక్ గ్యాస్ పాలసీని కేంద్రం అమలు చేస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కేంద్రం గ్యార్ సిలిండర్ ధరల విషయంలో సమీక్ష జరుపుతుంది.
విదేశీ మార్కెట్ లోని ధరలను బట్టి మన దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలను నిర్ణయించడం జరుగుతుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 1వ తేదీన భారీ మొత్తంలో ధరలు పెరిగే అంచనాలు అయితే ఉన్నాయి. విదేశాల్లో ప్రస్తుతం ఏపీఎం గ్యాస్ ధర ఎంఎంబీటీయూకు 1.79 డాలర్ గా ఉండగా ఈ ధర 3 డాలర్లకు పైగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం.
విదేశీ మార్కెట్ లో బుధవారం రోజున గ్యాస్ సిలిండర్ ధర నేచురల్ గ్యాస్ ధర 8 శాతం పెరిగింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగితే ప్రజల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి.