Guntur Kaaram: గుంటూరు కారం మూవీ అంచనాల మధ్య విడుదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మూవీ కావడంతో సహజంగానే హైప్ నెలకొంది. అందులోనూ త్రివిక్రమ్ డైరెక్టర్. ఓ దశాబ్దం తర్వాత ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. దాదాపు రూ. 150 కోట్లతో సినిమాను నిర్మించారు. దీంతో ఏపీ/ తెలంగాణ ప్రభుత్వాల నుండి ప్రత్యేక అనుమతులు తెచ్చుకున్నారు.
పది రోజుల పాటు టికెట్స్ ధరలు పెంచుకుని అమ్ముకునేలా అనుమతులు తెచ్చుకున్నారు. అలాగే స్పెషల్ షోలకు కూడా పర్మిషన్ దొరికింది. ఏపీలో అమలులో ఉన్న టికెట్స్ ధరలకు అధికంగా రూ. 50 పెంచి అమ్ముకునేలా అనుమతులు వచ్చాయి. ఇక తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో రూ. 65, మల్టీఫ్లెక్స్ లలో రూ. 100 అదనంగా టికెట్స్ ధరల పెంపుకు అనుమతులు ఇచ్చారు.
అలాగే ఉదయం అదనంగా షోలు వేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఇవన్నీ ఇప్పుడు వేస్ట్ అయ్యాయి. గుంటూరు కారం నెగిటివ్ టాక్ తెచ్చుకోగా రెండో రోజు నుండే వసూళ్లు తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కష్టపడి తెచ్చుకున్న అనుమతులు వేస్ట్ అయ్యాయి. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. త్రివిక్రమ్ కి సంక్రాంతి సెంటిమెంట్ మరోసారి కలిసి రాలేదు.
గుంటూరు కారం చిత్రాన్ని హడావుడిగా చిత్రీకరించి విడుదల చేయడం కూడా మైనస్ అయ్యింది. త్రివిక్రమ్ ఈ చిత్రం పై కనీస శ్రద్ధ పెట్టలేదు. దాని ఫలితమే ఈ ప్లాప్. గుంటూరు కారం మూవీలో మహేష్ ప్రెజెన్స్ తప్పితే చెప్పుకోవడానికి ఏమీ లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు కీలక రోల్స్ చేశారు. థమన్ సంగీతం అందించాడు.