https://oktelugu.com/

Minister Ambati Rambabu: సంబరాల రాంబాబు మళ్లీ డ్యాన్స్ తో ఇరకొట్టేశారు.. వైరల్ వీడియో

గత ఏడాది కూడా మంత్రి అంబటి రాంబాబు ఇదే తరహాలో డాన్సులు చేశారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొని డప్పు కళాకారులు, బంజారాలతో కలిసి నడిరోడ్డుపై డాన్సులు వేయడం అప్పట్లో ఆకట్టుకుంది.

Written By: , Updated On : January 14, 2024 / 10:10 AM IST
Minister Ambati Rambabu

Minister Ambati Rambabu

Follow us on

Minister Ambati Rambabu: మంత్రి అంబటి రాంబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. డ్యాన్సులతో హోరెత్తించారు. భోగి వేడుకల్లో మహిళలతో కలిసి ఆయన డాన్స్ చేయడం.. సంబరాల రాంబాబు పాటలకు స్టెప్పులు వేయడానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేటిజన్లను ఆకట్టుకుంటోంది. భోగిమంటల చుట్టూ మహిళలు, యువకులతో కలిసి లయబద్ధంగా డాన్సులు వేసిన అంబటి రాంబాబు అందర్నీ ఆకట్టుకున్నారు.

గత ఏడాది కూడా మంత్రి అంబటి రాంబాబు ఇదే తరహాలో డాన్సులు చేశారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొని డప్పు కళాకారులు, బంజారాలతో కలిసి నడిరోడ్డుపై డాన్సులు వేయడం అప్పట్లో ఆకట్టుకుంది. అందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటు తరువాత పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో సంబరాల శ్యాంబాబు పేరిట.. అంబటి రాంబాబు క్యారెక్టర్ తో పోలిన పాత్రను పెట్టడం వివాదంగా మారింది. అయితే రాంబాబు పాత్రలో నటుడు పృథ్విరాజ్ అచ్చుగుద్దినట్లు నటించి తెగ ఆకట్టుకున్నారు.

అయితే తాజాగా భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. సత్తెనపల్లి లో జరిగిన వేడుకల్లో స్టెప్పులు వేశారు. గత ఏడాదిని మరోసారి గుర్తు చేశారు. తన డాన్స్ తో గతంలో వివాదం తలెత్తినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఏకంగా సంబరాల శ్యాంబాబు పాటకు ఆయన డాన్సులు వేయడం విశేషం. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని.. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తానని అంబటి రాంబాబు చెప్పడం విశేషం.