Pushpa 2: పుష్ప 2 లో గెస్ట్ రోల్ లో కనిపించనున్న ఆ స్టార్ హీరో…

మరి ఆ గెస్ట్ గా కనిపించే హీరో ఎవరు అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అయితే ఈ క్యారెక్టర్ కోసం మొదట తెలుగు స్టార్ హీరోని తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఆయన కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ క్యారెక్టర్ లో....

Written By: Gopi, Updated On : January 8, 2024 12:32 pm
Follow us on

Pushpa 2: తెలుగు సినిమా డైరెక్టర్లలో లాజికల్ గా సినిమాలను తీసి సక్సెస్ కొట్టడంలో సుకుమార్ మొదటి స్థానంలో ఉంటాడు. ప్రతి చిన్న సీన్ లో ఉన్న లాజిక్ పాయింట్ ని ఆలోచించి దాంట్లో ఉన్న లాజిక్ ను పట్టుకొని సీన్ రాసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకునేలా ఆ సీన్ ని మలుస్తాడు. ఇక ఇలాంటి సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా కోసం తనదైన రీతిలో కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక భారీ హీరో తో గెస్ట్ అప్పియరెన్స్ చేయిస్తున్నట్టు గా తెలుస్తుంది. అది కూడా సినిమా సిచువేషన్ ని బట్టి క్యారెక్టర్ ఎంట్రీ ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి ఆ గెస్ట్ గా కనిపించే హీరో ఎవరు అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అయితే ఈ క్యారెక్టర్ కోసం మొదట తెలుగు స్టార్ హీరోని తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఆయన కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ క్యారెక్టర్ లో బాలీవుడ్ స్టార్ హీరో అయిన రన్వీర్ సింగ్ కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

నిజానికి ఈ క్యారెక్టర్ కి తెలుగు హీరో అయితే బాగా సెట్ అయ్యేవాడు అని సుకుమార్ ముందు నుంచి అనుకున్నప్పటికీ దీనికోసం ఒక స్టార్ హీరోని సంప్రదించారు కానీ ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఈ ఛాన్స్ బాలీవుడ్ హీరో కి వెళ్ళింది అని సినిమా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తుంది.

మరి అది ఎలాంటి క్యారెక్టర్ అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో తెగ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ఇప్పటికే పుష్ప 2 లో ఫాహద్ ఫజిల్ లాంటి ఒక టాలెంటెడ్ నటుడు ఉన్నాడు నటన తో ఆయన స్టామినా ఏంటో చూపించుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరో కూడా దీంట్లో జాయిన్ అవ్వడం ఈ సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చినట్టు అవుతుందని ట్రేడ్ పండితులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఇక రీసెంట్ గా రణ్బీర్ కపూర్ కి అనిమల్ సినిమాతో మన తెలుగు డైరెక్టర్ అయిన సందీప్ వంగ ఒక అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అదే బాటలో సుకుమార్ కూడా రణ్వీర్ సింగ్ లాంటి స్టార్ హీరోకి హిట్ ఇవ్వబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి…