Guntur Kaaram: గుంటూరు కారం సినిమా విషయంలో త్రివిక్రమ్ అనుకుంటున్నా స్ట్రాటజీలు ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రతి సినిమా విషయంలో తనే ముందుండి అన్ని నడిపిస్తూ తన స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటాడు కానీ గుంటూరు కారం సినిమా విషయంలో ఆ స్ట్రాటజీ అనేది మిస్ అవుతుంది.
గురూజీకి అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఈ సినిమా చేశాడా..? లేదంటే ఆ సినిమా ఔట్ పుట్ మీద పూర్తి కాన్ఫిడెంట్ గా లేడా..? అనే విషయం మీదనే ఇప్పుడు క్లారిటీ అయితే రావడం లేదు. ఎందుకంటే ప్రతి సినిమా ప్రమోషన్ విషయంలో గాని, నటీనటుల విషయం లో గానీ అన్నింటిలో దగ్గరుండి తనే చూసుకొని ఆ సినిమా మీద హైప్ తెప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. కానీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి త్రివిక్రమ్ అనుసరిస్తున్న విధానాన్ని చూస్తే ఈ సినిమా మీద ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నటైతే కనిపించడం లేదు.
ఈ సినిమా రెండు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది.కొద్దీ రోజులు షూట్ చేసి ఆ మొత్తాన్ని తీసేసి కథ మార్చి మళ్లీ ఫ్రెష్ గా ఇంకో కథ తో షూట్ చేశారు. అందువల్ల త్రివిక్రమ్ దీని మీద పూర్తిగా ఎఫర్ట్ పెట్టనట్టు గా తెలుస్తుంది. ఇక ఇది కంప్లీట్ గా మహేష్ బాబుకు సంబంధించిన స్క్రిప్ట్ గా తెలుస్తుంది. అంటే త్రివిక్రమ్ కథ రాసుకున్నప్పటికీ మహేష్ బాబు దాంట్లో చాలా ఇన్ పూట్స్ ఆడ్ చేసినట్టు గా అర్థమవుతుంది. అలాగే హీరోయిన్ విషయంలో కూడా మహేష్ బాబు దగ్గర ఉండి సెలెక్ట్ చేసినట్టు గా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ముందు గా త్రివిక్రమ్ పూజ హెగ్డే ని తీసుకుంటే మహేష్ బాబు మాత్రం తనని రిజెక్ట్ చేసి శ్రీలీలా ని హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇక ఆ విషయం లో త్రివిక్రమ్ కొంతవరకు అప్సెట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది.
అందుకే ఒప్పుకున్నాడు కాబట్టి త్రివిక్రమ్ ఈ సినిమా చేసి పెట్టినట్టుగా తెలుస్తుంది అంతే తప్ప తన పూర్తి ఇంట్రెస్ట్ పెట్టీ ఈ సినిమా తీసినట్టు గా అయితే కనిపించడం లేదు.ఇక ఈ సినిమా మీద మహేష్ బాబు డామినేషన్ ఎక్కువ అవ్వడం వల్లనే త్రివిక్రమ్ డల్ అయిపోయాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే గుంటూరు కారం ట్రైలర్ కూడా అంత పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఇంతకుముందు త్రివిక్రమ్ సినిమా నుంచి ట్రైలర్ వచ్చిందంటే భీభత్సమైన హైప్ ఉండేది కానీ ఈ ట్రైలర్ కి మాత్రం అంత పెద్ద ఫాలోయింగ్ అయితే ఏం రావడం లేదు. రెగ్యులర్ గా అన్ని సినిమాల్లో చూసినట్టుగానే అనిపిస్తుంది అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…