https://oktelugu.com/

Mani Chandana : అప్పట్లో రవితేజకి జంటగా నటించిన ఈ అమ్మాయి..నేడు ‘మిస్టర్ బచ్చన్’ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఎవరో గుర్తుపట్టారా?

ఆమె మరెవరో కాదు, మణి చందన. ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిల్చిన 'తొలిప్రేమ' చిత్రంలో హీరోయిన్ కీర్తి రెడ్డి స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత పలు చిత్రాలలో క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేసి, రవితేజ హీరో గా నటించిన 'మనసిచ్చాను' అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 19, 2024 / 08:09 PM IST

    mani chandhana

    Follow us on

    Mani Chandana. : మాస్ మహారాజ రవితేజ ఒకప్పుడు ఇతర హీరోల సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ ని చేసుకుంటూ నేడు స్టార్ హీరో గా ఈ స్థాయిని అనుభవిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఒకప్పుడు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన సినిమాల్లోని హీరోలు ఇప్పుడు ఈయన సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తున్నారు. ఉదాహరణకు జగపతి బాబు హీరో గా నటించిన ‘బడ్జెట్ పద్మనాభం’ చిత్రంలో రవితేజ కమెడియన్ రోల్ చేసాడు. ఇప్పుడే అదే జగపతి బాబు రవితేజ హీరో గా నటించిన ‘నెల టిక్కెట్టు’, ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాలలో విలన్ గా నటించాడు. ఇదే రవితేజ సాధించిన సక్సెస్ కి ఉదాహరణ. అలాగే ఇదే మిస్టర్ బచ్చన్ చిత్రంలో ఒకప్పుడు రవితేజ పక్కన హీరోయిన్ గా నటించిన అమ్మాయి, ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టు గా నటించింది.

    ఆమె మరెవరో కాదు, మణి చందన. ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిల్చిన ‘తొలిప్రేమ’ చిత్రంలో హీరోయిన్ కీర్తి రెడ్డి స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత పలు చిత్రాలలో క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేసి, రవితేజ హీరో గా నటించిన ‘మనసిచ్చాను’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కూడా ఒక పాటలో కనిపిస్తాడు. ఆయన శిష్యుడు శేఖర్ మాస్టర్ కూడా ఆ పాటలో ఉంటాడు. నేడు శేఖర్ మాస్టర్ ఇండియా లోనే టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లో ఒకడిగా కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అది కాసేపు పక్కన పెడితే అప్పట్లో ఈ సినిమాలో రవితేజ సరసన నటించిన మణిచందన, నేడు మిస్టర్ బచ్చన్ చిత్రం లో జగపతి బాబు కి భార్య గా, ఆ ఇంటి పెద్ద కోడలిగా నటించింది. ఈ సినిమాలో ఆమెకి, రవితేజ కి మధ్య కొన్ని సన్నివేశాలు కూడా ఉంటాయి. అలా ఒకప్పుడు రవితేజ కి హీరోయిన్ గా నటించిన ఈమె, ఇప్పుడు ఆయన సినిమాలోనే క్యారక్టర్ ఆర్టిస్టుగా చెయ్యడం విశేషం. మణి చందన గతం లో ‘టెన్షన్ టెన్షన్’, ‘దేవి నాగమ్మ’, ‘ఎన్టీఆర్ నగర్’ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

    అంతే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘నిజం’ చిత్రంలో ‘రత్తాలు..రత్తాలు..నూజివీడు రత్తాలు’ అనే పాటలో మహేష్ తో కలిసి చిందులేసిన హీరోయిన్ మరెవరో కాదు, ఈమెనే. ఇవే కాకుండా తమిళం, కన్నడలో కూడా ఈమె పలు సినిమాల్లో నటించింది. తెలుగులో ఈమెకి ఒక్క హిట్ కూడా రాలేదు కానీ, తమిళం లో మాత్రం పలు హిట్ సినిమాలు పడ్డాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకు పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. మళ్ళీ 14 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘ఉంగరాల రాంబాబు’ అనే చిత్రం తో క్యారక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చి తన కెరీర్ ని కొనసాగిస్తూ ముందుకు పోతుంది.