Gabbar Singh : ఓవర్సీస్ లో మొదలైన ‘గబ్బర్ సింగ్’ అడ్వాన్స్ బుకింగ్స్..ఒక్క గంటలో ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయో తెలుసా!

గబ్బర్ సింగ్' చిత్రాన్ని వివిధ సందర్భాలలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో సార్లు స్పెషల్ షోస్ వేసుకున్నారు. అలాంటి సినిమాని మళ్ళీ రీ రిలీజ్ కోసం ఎంచుకోవడం సాహసమే. ఎందుకంటే గబ్బర్ సింగ్ చిత్రం 'ఖుషి', 'మురారి', 'పోకిరి' లాగ నేటి తరం ఆడియన్స్ థియేటర్ లో మిస్ అయిన సినిమా కాదు కాబట్టి.

Written By: Vicky, Updated On : August 19, 2024 8:15 pm

Gabbhar Singh Re Release

Follow us on

Gabbar Singh : గత రెండేళ్ల నుండి టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల మేనియా ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘పోకిరి’ సినిమాతో మొదలైన ఈ మేనియా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొంతకాలం రీ రిలీజ్ సినిమాల ఊపు తగ్గినప్పటికీ, రీసెంట్ గా విడుదలైన ‘మురారి’ చిత్రంతో మళ్ళీ ఊపు అందుకుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఎప్పటి నుండో చెక్కు చేరకుండా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ గ్రాస్ రికార్డుని బద్దలు కొట్టి సెన్సేషన్ సృష్టించింది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ‘మురారి’ చిత్రానికి ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధనమైన విషయం కాదు. ఇప్పుడు ఈ రికార్డు ని సెప్టెంబర్ 2 వ తారీఖున విడుదల కాబోతున్న ‘గబ్బర్ సింగ్’ చిత్రం బద్దలు కొడుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్న.

‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని వివిధ సందర్భాలలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో సార్లు స్పెషల్ షోస్ వేసుకున్నారు. అలాంటి సినిమాని మళ్ళీ రీ రిలీజ్ కోసం ఎంచుకోవడం సాహసమే. ఎందుకంటే గబ్బర్ సింగ్ చిత్రం ‘ఖుషి’, ‘మురారి’, ‘పోకిరి’ లాగ నేటి తరం ఆడియన్స్ థియేటర్ లో మిస్ అయిన సినిమా కాదు కాబట్టి. అయినప్పటికీ కూడా ఈ సినిమాతో రికార్డు పెడుతామని పవన్ కళ్యాణ్ అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు. కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ఆస్ట్రేలియా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైంది. అక్కడి ట్రేడ్ అంచనాల ప్రకారం బుకింగ్స్ ప్రారంభమైన గంట లోపే దాదాపుగా 80 కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట. రెండు వారాల ముందు ఒక సినిమాకి ఈ స్థాయిలో ఆస్ట్రేలియా లో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ఇదే తొలిసారి. మురారి చిత్రానికి క్లోసింగ్ లో 850 కి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. మరి గబ్బర్ సింగ్ ఈ రికార్డుని బద్దలు కొడుతుందో లేదో చూడాలి. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమాకి ఆస్ట్రేలియా నుండి ఇప్పటి వరకు 1500 ఆస్ట్రేలియన్ డాలర్స్ వచ్చాయి. మురారి చిత్రానికి క్లోసింగ్ లో 15 వేల డాలర్లు వచ్చాయని అక్కడి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రానికి 13 వేల డాలర్లు రాగా, ఎన్టీఆర్ సింహాద్రి చిత్రానికి 12 వేల డాలర్లు వచ్చాయి. ఇప్పుడు ‘గబ్బర్ సింగ్’ చిత్రం మురారి ని బద్దలు కొట్టి టాప్ స్థానం లో కూర్చుంటుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ఈ నెల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22 వ తారీఖున ప్రారంభం కానుంది. ఓవర్సీస్ లో గబ్బర్ సింగ్ చిత్రంతో సరికొత్త బెంచ్ మార్క్ పెట్టాలనే కసితో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ మొదటి పుట్టినరోజు కావడంతో ఎక్కడా కూడా తగ్గకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈసారి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను జరపబోతున్నారు.