Young Heroes: ఈ యంగ్ హీరోలు టైర్ వన్ హీరో అవ్వాలంటే ఇదొక్కటి చేయాల్సిందే..?

ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క చిన్న హీరో టార్గెట్ కూడా పెద్ద హీరోగా ఎదగాలనే.. ఇక ఈ క్రమంలోనే వాళ్లు వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ ఆ సినిమాల కోసం విపరీతంగా కష్టపడుతూ ఆ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహిస్తూ ఉంటారు.

Written By: Gopi, Updated On : April 12, 2024 3:46 pm

These young heroes have to do this to become tier one heroes

Follow us on

Young Heroes: ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరి టార్గెట్ స్టార్ హీరోగా ఎదగడమే.. ఎందుకు అంటే స్టార్ హీరోగా ఎదిగితే ఆ కంఫర్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. రెమ్యూనరేషన్ పరంగా గాని, క్రేజ్ పరంగా గాని వాళ్ళు స్టార్ స్టేటస్ ని అనుభవిస్తారనే చెప్పాలి. ఇక ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క చిన్న హీరో టార్గెట్ కూడా పెద్ద హీరోగా ఎదగాలనే.. ఇక ఈ క్రమంలోనే వాళ్లు వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ ఆ సినిమాల కోసం విపరీతంగా కష్టపడుతూ ఆ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహిస్తూ ఉంటారు.

ఇక ఇప్పుడు యంగ్ హీరోలుగా కొనసాగుతున్న సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జా లాంటి యంగ్ హీరోలు స్టార్ హీరోలుగా వెలుగొందే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసిన ఇంతకుముందు సినిమాలు మంచి విజయాలను దక్కించుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో కూడా వీళ్ళు విపరీతమైన అభిమానాన్ని అయితే మూటగట్టుకుంటున్నారు. ఇక సీనియర్ హీరోలను మినహాయిస్తే ప్రస్తుతం తెలుగులో కేవలం ఆరుగురు హీరోలుగా మాత్రమే టైర్ వన్ హీరోలుగా కొనసాగుతున్నారు. అందులో పవన్ కళ్యాణ్,మహేష్ బాబు, ప్రభాస్,రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఉన్నారు.

ఇక ఇండస్ట్రీలో ఎలాంటి పెద్ద సినిమా రావాలన్నా ఈ ఆరుగురు నుంచే రావాలి. అందుకోసమే చాలామంది దర్శకులు వీళ్లలో ఎవరో ఒకరితో సినిమా చేసి స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందాలని చూస్తూ ఉంటారు. ఇక మిగిలిన హీరోలందరూ మీడియం రేంజ్ హీరోలే వాళ్లతో సినిమాలు చేసిన అవి ఒక మోస్తారుగా హిట్ అవుతాయి తప్ప, ఇండస్ట్రీ హిట్లు కొట్టేంత సత్తా అయితే మిగతా హీరోలకు లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో పాగా వేస్తున్న సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జా లాంటి హీరోలు ఫ్యూచర్ లో టైర్ వన్ హీరోలుగా ఎదిగే అవకాశాలు అయితే ఉన్నాయి.

దానికోసం వాళ్లు చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళు చేసే సినిమాల్లో పర్ఫెక్షన్ ఉండేలా చూసుకోవాలి. అలాగే భారీ కలెక్షన్స్ ను రాబట్టే దిశగా మార్కెట్ ని పెంచుకోవాలి. ఇక వీలైతే ఇండస్ట్రీలో వీళ్ళు చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ లని సాధిస్తు ముందుకు సాగాలి అలా చేసినప్పుడే వీళ్ళు టైర్ వన్ హీరోగా ఎదుగుతారు…