https://oktelugu.com/

High Mileage cars : అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే..

మారుతికి సుజుకీ కార్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఆల్టో మాత్రమే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారుగా గుర్తింపు పొందొంది. కానీ ఇదే కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా లీటర్ కు 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 12, 2024 / 04:06 PM IST

    High Millage Car

    Follow us on

    High Mileage cars :  కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు కొందరు మైలేజ్ విషయంలో ఇంట్రస్ట్ పెడుతారు. ధర గురించి ఆలోచించకుండా మైలేజ్ ఎక్కువ ఇచ్చే కార్లు ఏవో తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మారుతి కంపెనీకి చెందిన ఆల్టో కే 10 పెట్రోల్ వేరియంట్ లో 22 కిలోమీటర్లు అత్యధికంగా మైలేజ్ ఇచ్చింది. దీనినిమించిన కారు లేదని చాలా మంది భావించారు. కానీ ఆల్టో కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఉన్నాయి. ఇందులో ఉండే ఇంజిన్ పవర్ తో దూసుకుపోతాయి. ఆ కార్ల వివరాలేవో తెలుసుకుందాం..

    టయోటా కంపెనీ నుంచి ఆకట్టుకునే మోడళ్లు ఎన్నో వచ్చాయి. వీటిలో అర్బన్ క్రూజర్ వెరీ ఇంప్రెస్ అన్నట్లుగా ఉంది. ఇందులో డ్యూయెల్ టోన్ కలర్స్, ఫాగ్ లైట్లు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కాంపాక్ట్ ఎస్ యూవీ ట్విన్ స్లాట్ గ్రిల్, ఫాక్స్ బార్, స్కిడ్ ప్లేట్ తో పాటు 16 అంగుళాల డైమంట్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీనిని రూ.16.66 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇది హైరైడర్ బలమైన హైబ్రిడ్ తో 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

    మారుతికి సుజుకీ కార్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఆల్టో మాత్రమే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారుగా గుర్తింపు పొందొంది. కానీ ఇదే కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా లీటర్ కు 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.18.43 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. గ్రాండ్ విటారా 87 బీహెచ్ పీ పవర్ తో పాటు 122 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. హోండా సిటీకి చెందిన eHEV మైలేజ్ విషయంలో ముందంజలో ఉంది. హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ తో నడిచే దీని ఇంజిన్ 27. 13 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.20.55 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

    మారుతికి చెందిన మరో కారు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారుగా నిలిచింది. అదే ఇన్విక్టో. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారగా ఉత్పత్తి అయిన ఇది 1987 సీసీ ఇంిజన్ తో నడుస్తుంది. ఇందులో 150 బీహెచ్ పీ పవర్ తో పాటు 188 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సుమారు 7 నుంచి 8 మంది కూర్చునే సౌకర్యం ఉన్న ఇది పూర్తిగా పెట్రోల్ వేరియంట్ కారుగా నిలచింది. ఇందులో తాజాగా సేప్టీ కోసం వెనుక సీటు బెల్ట్ ను కూడా రిమైండర్ ను ఏర్పాటు చేశారు.

    టయోటా పేరు చెప్పగానే గుర్తుకొచ్చే ఇన్నోవా. ఇది లేటేస్టుగా హైక్రాస్ తో నవీకరించబడింది. ఇది 2.0 లీటర్ పెట్రోల్, హైబ్రిడ్ పవర్ ట్రెయినర్ తో అందించబడుతుంది. టయోటా సాధారణ హైక్రాస్ జీఎక్స్ మోడల్ నుంచి కొత్త లిమిటెడ్ ఎడిషన్ కారుగా మారింది. ఇది రేడియేటర్ గ్రిల్ పై సెంటర్ లో క్రోమ్ గార్నిష్ ను కలిగి ఉంది. గరిష్టంగా 169 బీహెచ్ పీ పవర్ ను అందిస్తుంది. కొత్త సాప్ట్ టచ్ డాష్ బోర్డును కలగిన ఇది ప్యాబ్రిక్ సీట్లు, డ్యూయెల్ టోన్ బ్లాక్ బ్రౌన్ థీమ్స్ ను కలిగి ఉన్నాయి.