https://oktelugu.com/

Pawan Kalyan: బాలయ్య, పవన్ కళ్యాణ్ కెరియర్ లో వచ్చిన కొన్ని వరస్ట్ సినిమాలు ఇవే…

బాలయ్య, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇండస్ట్రీ లో టాప్ హీరోలుగా కొనసాగడం విశేషం...నిజానికి వీళ్ళ సినిమాలు వస్తున్నాయంటే అభిమానుల్లో ఒక పండగ వాతావరణం నెలకొంటుందనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : July 27, 2024 / 03:56 PM IST

    These are the worst films in Balakrishna and Pawan Kalyan career

    Follow us on

    Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి సపరేట్ క్రేజ్ ఉంటుంది. వాళ్లకు మిగతా హీరోలతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే కాకుండా మంచి విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి కోవకు చెందిన వారే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నట సింహం బాలయ్య బాబు…ఇక వీళ్లిద్దరి మధ్య కొన్ని పోలికలైతే ఉన్నాయి.వీళ్ళు ఇరువురు చేసిన సినిమాల్లో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతూ మిగతావి ఫ్లాప్ అయ్యాయి. కానీ వీళ్లు ఎప్పుడూ సక్సెస్ సాధించినా కూడా అవి ఒక పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాయనే విషయం ఇప్పటికీ చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇక గబ్బర్ సింగ్ సినిమాకి ముందు పవన్ కళ్యాణ్ కి ఒక 10 సంవత్సరాల వరకు ఒక్క హిట్టు కూడా లేదు. కానీ గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. అలాగే బాలయ్య బాబు కూడా సింహా సినిమాకి ముందు దాదాపు 6 సినిమాలతో భారీ ప్లాప్ లను ఎదుర్కొన్నాడు. ఇక సింహ సినిమాతో ఒక్కసారిగా భారీ సక్సెస్ ని సాధించి అభిమానుల్లో మంచి ఉత్సాహాన్ని నింపాడు. ఇకైదీల ఉంటే బాలయ్య, పవన్ కళ్యాణ్ ల కెరియర్లో కొన్ని వరస్ట్ సినిమాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    ముందుగా పవన్ కళ్యాణ్ గురించి చూసుకుంటే ఈయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. మొదటి సినిమా నుంచి ఖుషి సినిమా వరకు ఆయన ఒక్కొక్క సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తూ వచ్చాడు. ఖుషి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా యూత్ లో మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. అలాగే ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ నెంబర్ వన్ హీరోగా కూడా ఎదిగాడు…

    కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలే ఆయనకు భారీ డిజాస్టర్లను మిగిల్చాయి. ముఖ్యంగా ఈయన కెరియర్ లో చేసిన వరస్ట్ సినిమాలు ఏంటి అంటే పంజా, పులి సినిమాలు కావడం విశేషం… ఈ రెండు సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండేవి. కానీ ఈ రెండు సినిమాలు భారీ డిజాస్టర్లను మూటగట్టుకోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రమైన నిరాశకు గురయ్యారు…ఆయన ఎంటైర్ కెరీర్ లో ఇప్పటివరకు ఈ రెండు సినిమాలు చాలా వరస్ట్ సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి…

    ఇక ఇదిలా ఉంటే నట సింహం నందమూరి బాలయ్య బాబు తన కెరియర్ లో చేసిన సినిమాల్లో 2004 నుంచి 2009 వరకు చేసిన సినిమాల్లోనే చాలా వరస్ట్ సినిమాలు ఉన్నాయి…అందులో ఒక్కమగాడు, పల్నాటి బ్రహ్మ నాయుడు, విజయేంద్ర వర్మ, వీరభద్ర లాంటి సినిమాలు ఉన్నాయి… ఇక ఈ సినిమాల వల్ల ఆయన చాలా బ్యాడ్ నేమ్ అయితే సంపాదించుకున్నాడు. తన కెరియర్ లో ఇంకా కొన్ని వరస్ట్ సినిమాలు ఉన్నప్పటికీ వాటన్నింటిలో ఈ సినిమాలు మాత్రం వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఆయనకు భారీ డిజాస్టర్ల ను తీసుకొచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేలా చేశాయి.

    ఇక ఈ సినిమాల వాళ్ల ఆ సమయంలో ఆయన తన కెరియర్ మొత్తాన్ని కోల్పోతాడు ఇక ఆయనకు సినిమాలు చేసే అవకాశాలు రావు అనేంతలా ఒక చెడ్డ పేరునైతే మూటగట్టుకున్నాడు. ఇక మొత్తానికైతే బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వీరిద్దరు ఎప్పుడు సక్సెస్ కొట్టిన కూడా అది ఒక భారీ సక్సెస్ గా మిగులుతుంది అనేది మాత్రం వాస్తవం…