https://oktelugu.com/

Life Stlye : ఇంట్లో ఐశ్వర్యం పెరగాలన్నా.. లక్ష్మీదేవి గడప తొక్కాలన్నా.. భార్యభర్తలు ఇలా ఉండాలి.. అసలు ఏం చేయాలంటే?

భార్యభర్తల బంధం పవిత్రమైంది. ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదించినా అంతమైన భార్య లేదా మంచి భర్త లేకుండా వారి జీవితం సంతోషంగా గడవదు. కష్ట, సుఖాల్లో ఒకరినొకరు అర్థం చేసుకుంటే కలిసిమెలిసి ఉంటారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తే సర్ది చెప్పుకునే ఓపిక ఉండాలి. పెళ్లయిన కొంత మంది దంపతులు తాము ఐశ్వర్యవంతులు కావాలని కలలుకంటారు

Written By:
  • Srinivas
  • , Updated On : July 27, 2024 / 03:54 PM IST
    Follow us on

    Life Stlye  : జీవితం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందులో భాగంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని పూజలు, వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవి వద్ద ధనం, సంతోషం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వద్దన్నా వచ్చి చేరుతుంది. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం సాధించాలంటే కేవలం పూజలు, వ్రతాలు చేస్తే సరిపోదు. కొన్ని ఆధ్యాత్మిక నియమాలు పాటించాలి. ముఖ్యంగా పెళ్లయిన దంపతులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంసార జీవితంలో ఎన్నో ఆటు పోట్లు ఎదురవుతాయి. నేటి కాలంలో అందరూ విద్యావంతులే అయి ఉంటున్నారు. దీంతో ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో గొడవలు పడుతున్నారు. చాలా వరకు జంటలు పెళ్లయ్యాక చాన్నాళ్లు కలిసి ఉండలేకపోతుంటారు. చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చూస్తూ కొన్నాళ్లకే విడిపోతున్నారు. ఇలా ఉండడం వల్ల లక్ష్మీ అనుగ్రహం అస్సలు ఉండదని కొందరు పండితులు చెబుతున్నారు. పెళ్లయ్యాక డబ్బు సంపాదించాలని ఎంతో శ్రమ పడుతారు. కానీ ఎంతో కాలానికి గానీ అందమైన జీవితం గడపలేరు. కొందరు ఎంత కష్టపడుతున్నా ఇల్లు సంతోషంగా ఉండదు. డబ్బు వచ్చినట్లే వచ్చి వివిధ మార్గాల ద్వారా ఖర్చు అవుతుంది. దీంతో తీవ్ర ఆవేదన చెందుతారు. అందుకు వారు పాటిస్తున్న విధానాలు, అలవాట్లే కారణమని అంటున్నారు. అయితే దంపతులు సంతోషంగా జీవించాలంటే? వీరికి లక్ష్మీ అనుగ్రహం సాధించాలంటే? ఇంట్లో ఐశ్వర్యం పెరగాలంటే ఈ పని ఖచ్చితంగా చేయాలని కొందరు ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు. అవేంటంటే?

    భార్యభర్తల బంధం పవిత్రమైంది. ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదించినా అంతమైన భార్య లేదా మంచి భర్త లేకుండా వారి జీవితం సంతోషంగా గడవదు. కష్ట, సుఖాల్లో ఒకరినొకరు అర్థం చేసుకుంటే కలిసిమెలిసి ఉంటారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తే సర్ది చెప్పుకునే ఓపిక ఉండాలి. పెళ్లయిన కొంత మంది దంపతులు తాము ఐశ్వర్యవంతులు కావాలని కలలుకంటారు. పూజలు, వ్రతాలు చేస్తారు. కానీ దంపతులిద్దిరి ప్రవర్తనలో మాత్రం పొరపాట్లు చేస్తుంటారు.

    లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే ఇల్లు సంతోషంగా ఉండదు. ఇంట్లోకి లక్ష్మీ రావాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ముందుగా ఇంటిని నిత్యం శుభ్రంగా ఉండే విధంగా చూడాలి. ఉదయం చేయాల్సిన పనులు వెంటనే చేసేయాలి ఆ తరువాత ప్రతీ విషయాన్ని అర్థం చేసుకొని సమస్య పరిష్కారం దిశగా ఆలోచించాలి. మొత్తంగా ప్రశాంతంగా చిరునవ్వును కలిగి ఉండాలి. సంతోషం ఉన్న చోట లక్ష్మీ ఉంటుంది. ఈ సంతోషంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఫలితంగా ఇంట్లో ఉన్న వాళ్లంతా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఎవరి పనులు వారు చేస్తారు. ఇలా పనుల్లోల ఆటంకం లేకుండా ఉండడానికి సంతోషమే కారణం.

    సమస్యలు లేని సంసారం లేదు. కానీ ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. వాటి గురించి ఆలోచించకుండా హైరానా పడితే దు:ఖమే మిగులుతుంది. దు:ఖం అంటే దరిద్రం కోరి కోరి దరిద్ర దేవతను పిలవడం వల్ల లక్ష్మీ అక్కడ నిలవదు. అందువల్ సాధ్యమైనంత వరకు భార్యభర్తలు కలిసి మెలిసి ఉండడానికి ప్రయత్నించాలి. చిన్న చిన్న వాటికి గొడవలు పడకుండా సర్దుకుపోవాలి. భార్యభర్తలు సంతోషంగా ఉండడం వల్ల వారి పిల్లలు మంచి వాతావరణంలో పెరుగుతారు. వారి జీవితం బాగుంటే భార్య భర్తలు కూడా సంతోషంగా ఉంటారు. మొత్తంగా వారి ఫ్యామిలీ ఆరోగ్యకరమైనది గా ఉంటుంది. అంతేగానీ కోపాలకు పోయి, గొడవలు పడి పూజలు, వ్రతాలు చేసినా ఫలితం ఉండదు. ఇప్పటికైనా ఇంట్లో ఉన్న గొడవలకు స్వస్తి చెప్పండి. సంతోషంగా జీవిస్తూ ఐశ్వర్యవంతులుగా మారండి.