https://oktelugu.com/

Tollywood: టాలీవుడ్ లో అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన టాప్ 5 చిత్రాలు ఇవే..’దేవర’ ఏ స్థానంలో ఉందంటే!

ఈ ఏడాది మే 9వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : October 24, 2024 / 02:31 PM IST

    Tollywood(9)

    Follow us on

    Tollywood: మన ఇండియన్ సినీ ప్రేమికులు టిక్కెట్లు కౌంటర్ లో కొనుక్కునే రోజులు పోయి చాలా కాలం అయ్యింది. బుక్ మై షో, పేటీఎం వంటి ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ యాప్స్ వచ్చినప్పటి నుండి ప్రేక్షకులు నూటికి 90 శాతం కి పైగా టికెట్స్ కోసం వీటినే గత దశాబ్ద కాలం నుండి ఉపయోగిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా బుక్ మై షో యాప్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అత్యధికంగా ఈ యాప్ ని వినియోగిస్తున్నందున బుక్ మై షో యాప్ సరికొత్త ఫీచర్స్ ని పరిచయం చేస్తూ వస్తుంది. ఈమధ్య కాలం లోనే ప్రతీ సినిమాకి గంటకి ఎన్ని టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి, 24 గంటలకు ఎన్ని టికెట్స్ అమ్ముడుపోతున్నాయి అనేది చూపించేస్తుంది. దీంతో ప్రతీ సినిమాకి ఎన్ని టికెట్స్ సేల్ అవుతున్నాయి వంటివి తెలిసిపోతుంది. ఇంతకు ముందు ఇలాంటి వెసులుబాటు ఉండేది కాదు. అయితే బుక్ మై షో యాప్ ప్రకారం, కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలైన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలలో అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన టాప్ 5 తెలుగు సినిమాలు ఏమిటో చూద్దాము.

    కల్కి 2898 AD :

    ఈ ఏడాది మే 9వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అన్ని భాషలకు కలిపి ఈ సినిమా 1000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నెంబర్ 1 స్థానంలో ఉన్న ఈ చిత్రం, టికెట్స్ అమ్మకాలలో కూడా టాప్ 1 స్థానం లో ఉంది. బుక్ మై షో గణాంకాల ప్రకారం ఈ సినిమాకి కోటి 24 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయట.

    సలార్:

    గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. వరుస ఫ్లాప్స్ లో ఉన్న ప్రభాస్ ని గాడిలో పెట్టిన సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 620 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి బుక్ మై షో యాప్ లో 70 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.

    దేవర :

    #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుండి విడుదలైన ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్స్ తో పాటు, లాంగ్ రన్ కూడా దక్కింది. ట్రేడ్ అందించిన లెక్కల ప్రకారం ఈ సినిమాకి 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాగే బుక్ మై షో యాప్ లో 47 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం.

    హనుమాన్:

    ఈ ఏడాది సంక్రాంతి కానుకగా చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద 350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాగే బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకి 45 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది.

    ఆదిపురుష్ :

    ప్రభాస్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలవడమే కాకుండా, ఆయనకీ బోలెడంత నెగటివిటీ ని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. కానీ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ట్రేడ్ అందించిన లెక్కల ప్రకారం ఈ సినిమాకి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 50 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది.