YCP Vs TDP: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. చెప్పిన మాట ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ట్వీట్ పెట్టింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా గురువారం 12 గంటలకు కీలక విషయాలను బయటపెడతామని టిడిపి తో పాటు వైసిపి సోషల్ మీడియా ప్రకటించింది. అన్నట్టుగానే వైసిపి అధికారిక సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ పెట్టింది.’ మీడియా ముసుగు వేసుకొని డ్రగ్స్ మాఫియాను నడిపిస్తున్న వారికి టీటీడీ చైర్మన్ పదవులా? గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్ గా వ్యవహారాలు నడుపుతూ అడ్డంగా దొరికిన న్యూస్ ఛానల్ అధినేత. సాక్షాలు ఇవిగో’ అంటూ కొన్ని పత్రాలను జత చేసి ట్వీట్ పెట్టింది. ప్రస్తుతం ఇది వైరల్ అంశంగా మారాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. టీటీడీ అధ్యక్షుడిగా ఓ మీడియా ఛానల్ అధినేత పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దాదాపు ఆయన పేరు ఖరారు చేశారని ప్రచారం జరిగింది. మరి కొద్ది రోజుల్లో నామినేటెడ్ పోస్టులతో పాటు టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకం చేపడతారని తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో బాంబు పేల్చడం విశేషం.
* ట్రూత్ బాంబ్ అంటూ ప్రచారం
నిన్న దీనిపైనే తెగ ప్రచారం నడిచింది. ట్రూత్ బాంబు కోసం అందరూ సిద్ధంగా ఉండండి అంటూ వైసీపీ ప్రచారం మొదలు పెట్టింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు డ్రాప్ అవుతోంది. స్టే ట్యూన్ అంటూ వైసిపి చేసిన ట్విట్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అందుకు సంబంధించి ప్రిపేర్ ఫర్ ద బిగ్ రివిల్ అనే పోస్టర్ను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. సరిగ్గా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫుల్ క్లారిటీ ఇస్తూ వైసిపి ఈ సంచలన పోస్ట్ పెట్టింది.
* సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివ్
ఇటీవల వైసిపి సోషల్ మీడియా విభాగ బాధ్యతలను సజ్జల భార్గవ్ రెడ్డి వదులుకున్నారు. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించారు. అప్పటినుంచి వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయ్యింది. పార్టీ శ్రేణులు సోషల్ మీడియా విభాగంలో సేవలందిస్తే.. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో చాలామంది వైసిపి శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చేరారు. అయితే ఇటీవల వైసిపి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. ఇప్పుడు టిడిపి అనుకూల మీడియాకు చెందిన.. ఓ ఛానల్ అధిపతిపై సంచలన పోస్ట్ పెట్టడం విశేషం.
Exposed
మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?
గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!#YellowMediaDrugsMafia pic.twitter.com/1TDPqGtjsS
— YSR Congress Party (@YSRCParty) October 24, 2024