https://oktelugu.com/

Naga Chaitanya Sobhita: పెళ్ళికి ముందే ఆ విషయంలో నాగ చైతన్య, శోభిత మధ్య గొడవలు..సమంత జ్ఞాపకాలు వెంటాడుతున్నాయా?

ఈ ఫ్లాట్ లో వీళ్లిద్దరు కలిసి కొంతకాలం ఉండేవారు. విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ఆ ఫ్లాట్ ని ఖాళీ చేసి నాగార్జున ఇంటికి వెళ్ళిపోయాడు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ ఫ్లాట్ లోకి పెళ్ళైన తర్వాత వెళ్లాలని నాగ చైతన్య అనుకుంటున్నాడట, కానీ అందుకు శోభిత దూళిపాళ్ల ఒప్పుకోవడం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : October 24, 2024 / 02:38 PM IST

    Naga chaitanya - Sobhita

    Follow us on

    Naga Chaitanya Sobhita: ఆగస్టు నెలలో అభిమానులకు, ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇస్తూ అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే నెలలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే శోభిత మాత్రం పెళ్ళికి ముందు సంప్రదాయబద్ధంగా జరగాల్సిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్ బిజీ గా గడుపుతుంది. రీసెంట్ గానే ఈమె వైజాగ్ కి చేరుకొని అక్కడ తన కుటుంబ సభ్యుల సమక్ష్యంలో పెళ్లి పనులు మొదలు పెట్టింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరికీ సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సమంతతో నాగ చైతన్య గతంలో వైవాహిక జీవితంలో ఉన్నప్పుడు ఒక అందమైన ఫ్లాట్ ని కట్టించుకున్నాడు.

    ఈ ఫ్లాట్ లో వీళ్లిద్దరు కలిసి కొంతకాలం ఉండేవారు. విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ఆ ఫ్లాట్ ని ఖాళీ చేసి నాగార్జున ఇంటికి వెళ్ళిపోయాడు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ ఫ్లాట్ లోకి పెళ్ళైన తర్వాత వెళ్లాలని నాగ చైతన్య అనుకుంటున్నాడట, కానీ అందుకు శోభిత దూళిపాళ్ల ఒప్పుకోవడం లేదు. ఆ ఫ్లాట్ నీ మాజీ భార్య ఇష్టానికి తగ్గట్టుగా డిజైన్ చేయించి కట్టించుకున్నదని, ఆ ఇంటికి వెళ్తే మళ్ళీ నీ మాజీ భార్య జ్ఞాపకాలు నీకు గుర్తుకు వస్తాయని, పైగా ఆ ఫ్లాట్ పెళ్లి జంటలకు కలిసొచ్చేలా లేదని, అందుకే మీరిద్దరూ విడిపోయారని, ఆ ఫ్లాట్ ని అమ్మేసి వేరే ఎక్కడైనా కొత్త ఫ్లాట్ కొనుగోలు చేస్తే బాగుంటుందని శోభిత నాగ చైతన్య తో అనిందట. అందుకు నాగ చైతన్య ఒప్పుకోలేదు, ఎంతో ఇష్టంగా నా అభిరుచికి తగ్గట్టుగా ఆ ఫ్లాట్ ని కట్టించుకున్నానని, ఎట్టిపరిస్థితిలో మన కొత్త కాపురం అక్కడే పెట్టాలని నాగ చైతన్య తెగేసి చెప్పాడట.

    అలా ఈ విషయంలో వీళ్లిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్టు ఇండస్ట్రీ లో ఒక టాక్ నడుస్తుంది. ఇలా పెళ్ళికి ముందే గొడవ జరగడం ఏమిటో అని సోషల్ మీడియా లో అక్కినేని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన తండేల్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘కార్తికేయ’ సిరీస్ ఫేమ్ చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అల్లు అరవింద్ సుమారుగా 75 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి ముందు నాగ చైతన్య నటించిన ‘థాంక్యూ’, ‘కస్టడీ’ వంటి చిత్రాలు కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన అమెజాన్ ప్రైమ్ కోసం ‘దూత’ అనే వెబ్ సిరీస్ చేసాడు. ఇది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ‘తండేల్’ తో థియేట్రికల్ పరంగా కూడా భారీ హిట్ కొట్టాలని అక్కినేని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.