Top 10 Indian grocers of 2025: 2025 వ సంవత్సరం రేపటితో ముగియనుంది. ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ ఉన్నాయ్ , ఆల్ టైం మెగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి, డిజాస్టర్స్ ఉన్నాయి, అట్టర్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయితే టాప్ 10 హైయెస్ట్ గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. మన టాలీవుడ్ నుండి కేవలం ఓజీ చిత్రం మాత్రమే టాప్ 10 లో నిల్చింది.
ధురంధర్(Dhurandhar):
డిసెంబర్ 4 న విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. దానికి తగ్గట్టుగా వసూళ్లు కూడా రోజురోజుకి పెరుగుతూ పోయాయి. ఇప్పటియికీ బాక్స్ ఆఫీస్ వద్ద డామినేషన్ చూపిస్తూ ముందుకు దూసుకుపోతున్న ఈ చిత్రం, ప్రస్తుతానికి వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని రాబట్టి మొదటి స్థానం లో ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ ఉంది. ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
కాంతారా 2(Kantara : The Chapter 1):
కాంతారా చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం తో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 853 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి రెండవ స్థానం లో నిల్చింది.
చావా(Chhaava) :
ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు, శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని, విక్కీ కౌశల్ హీరో గా నటించిన ఈ సినిమాకు 808 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ముందుగా ఈ చిత్రాన్ని కేవలం హిందీ వెర్షన్ లోనే విడుదల చేశారు. మూడు వారాలు తర్వాత తెలుగు లో కూడా దబ్ చేసి విడుదల చేశారు. ముందే అన్ని భాషల్లో విడుదల చేసుంటే బహుశా ఈ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ ని అందుకునేది ఏమో.
సైయారా(Saiyaaraa) :
కొత్త వాళ్ళతో తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ కి విడుదలకు ముందు భారీ హైప్ ఉండేది. ఎందుకంటే పాటలు ఆ రేంజ్ లో హిట్ అయ్యాయి కాబట్టి. విడుదల తర్వాత కూడా పాజిటివ్ టాక్ రావడం తో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 575 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
కూలీ(Coolie) :
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. ఫలితంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన ఈ సినిమా 516 కోట్ల తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
వార్ 2 (War 2):
హృతిక్ రోషన్ హీరో గా నటించిన ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ బాలీవుడ్ ఆడియన్స్ లో స్పై యూనివర్స్ సినిమాలకు ఉన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రానికి 360 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఈ చిత్రం లో విలన్ గా నటించిన ఎన్టీఆర్ క్రేజ్ తెలుగు లో ఏ మాత్రం ఉపయోగపడలేదు, ఇక్కడి నుండి కేవలం 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
మహావతార్ నరసింహా(Mahavatar Narasimha):
యానిమేషన్ చిత్రం గా తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద 326 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.
ఓజీ(They Call Him OG):
పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ విడుదలైంది. అభిమానులకు ఈ సినిమా బాగానే నచ్చింది కానీ, మామూలు ఆడియన్స్ కి మాత్రం యావరేజ్ రేంజ్ లో నచ్చింది. అయినప్పటికీ కూడా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 325 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. వచ్చిన వసూళ్లు మొత్తం తెలుగు వెర్షన్ నుండే అవ్వడం విశేషం. పాన్ ఇండియా లెవెల్ లో భారీ రిలీజ్ చేసి ఉండుంటే కచ్చితంగా ఈ చిత్రం 450 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేది.
లోక చాప్టర్ 1(Lokah : The Chapter 1) :
కళ్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలో కనిపించిన ఈ చిత్రం, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై 302 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సౌత్ లో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం ఇదే తొలిసారి.
హౌస్ ఫుల్ 5(Housefull 5):
అక్షయ్ కుమార్,బాబీ డియోల్ , అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ హౌస్ ఫుల్ సిరీస్ కి జనాల్లో మంచి క్రేజ్ ఉండడం తో కమర్షియల్ గా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 292 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.