ఎంటర్టైన్మెంట్Boyapati Srinu: మాస్ ని ఉర్రూతలూగించిన డైరెక్టర్ బోయపాటి కెరీర్ లో టాప్ 10 డైలాగ్స్...

Boyapati Srinu: మాస్ ని ఉర్రూతలూగించిన డైరెక్టర్ బోయపాటి కెరీర్ లో టాప్ 10 డైలాగ్స్ ఇవే!

Boyapati Srinu: టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్స్ మాస్ డైరెక్టర్ ఎవరు అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చే పేరు బోయపాటి శ్రీను. ఈయన సినిమాలు ఎంత మాస్ గా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు,హీరో తో సంబంధం లేకుండా ఈయన సినిమా వస్తుందంటే థియేటర్స్ కి మాస్ ఆడియన్స్ క్యూలు కట్టేస్తారు.భద్ర , తులసి , సింహా, లెజెండ్ మరియు అఖండ ఇలా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఆయన పుట్టిన రోజు వేడుకలు షూటింగ్ లొకేషన్ లోనే జరిగింది. రామ్ , శ్రీలీల, శ్రీకాంత్ మరియు మూవీ యూనిట్ కేక్ కటింగ్ కార్యక్రమం లో పాల్గొన్నారు, దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి.ఇది ఇలా ఉండగా బోయపాటి 53 వ సంవత్సరం లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయన కలం నుండి వచ్చిన టాప్ 10 పవర్ ఫుల్ డైలాగ్స్ ఏమిటో ఒకసారి చూద్దాము.

బోయపాటి శ్రీను బాలయ్య బాబు కి ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ రాసాడు, ఆయన తీసిన సినిమాలలో మూడు బ్లాక్ బస్టర్ హిట్లు బాలయ్య తోనే ఉంటాయి.ముఖ్యంగా సింహా చిత్రం లోని కొన్ని డైలాగ్స్ చూద్దాము.

“చూడు..ఒకవైపే చూడు..రెండో వైపు చూడాలనుకోకు..మాడిపోతావ్”.
“కొడితే మెడికల్ టెస్టులు చేయించుకొడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవ్”.
“నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి..కాదని ఏది పని చేసిన నీ నెక్స్ట్ బర్త్ డే ఉండదు”

ఇక బాలయ్య బాబు తో ఆయన చేసిన రెండవ చిత్రం లెజెండ్ లో కూడా అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి.ఈ చిత్రం కూడా బాలయ్య కెరీర్ లో మైలు రాయిగా నిలిచింది.ఇందులోని డైలాగ్స్ ఒకసారి చూద్దాం.

“ఫ్లూటు జింక ముందు ఊదు..సింహం ముందు కాదు”.
“నువ్వు భయపెడితే బయపడడానికి నేను ఓటర్ ని అనుకున్నావా బే..షూటర్ ని కాల్చి పారేస్తా కొడకా”.
“నీకు బీపీ వస్తే నీ PA వణుకుతాడేమో,నాకు బీపీ వస్తే AP వణుకుద్ది”.
“నీకు నరికేకొద్దీ అలుపొస్తాడేమో..కానీ నాకు ఊపు వస్తాది”.

ఇక జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన దమ్ము చిత్రం కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించలేదు కానీ , ఇందులోని ఒక డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది, ఆ డైలాగ్ ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందాము.

“బ్రతకండి బ్రతకండి అంటే వినలేదు కదా రా..కొత్తమొదలైంది..ఇక రాత రాసిన భగవంతుడు వచ్చినా ఆపలేదు”.

ఇక రీసెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన అఖండ లోను అదిరిపొయ్యే డైలాగ్స్ ఉన్నాయి.

“కాళ్ళు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది, కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది”.
“ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శ్రీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనడానికి..శ్రీను గారు నీ అమ్మమొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా ల**డి కొడకా”.

ఇలా బోయపాటి సినిమాల్లో సన్నివేశాలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో, డైలాగ్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయి.అందుకే బోయపాటి శ్రీను సినిమాలంటే మాస్ ఆడియన్స్ కి ఒక విజువల్ ట్రీట్ లాగా ఉంటుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Tollywood Directors: ఈ స్టార్ డైరెక్టర్స్ పరిస్థితి ఏంటి…సక్సెస్ లు ఎప్పుడు కొడతారు…

Tollywood Directors: ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్లకు మాత్రమే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. వాళ్లతో సినిమాలు చేయడానికి ఎక్కువ మంది హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్లకి మార్కెట్ కూడా విపరీతంగా ఉంటుంది. ప్రేక్షకులు...

Balakrishna: బాలయ్య ఎవరినైతే నమ్ముతాడో వాళ్లే మోసం చేస్తున్నారా…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన బాలయ్య తండ్రికి తగ్గ...

Most Popular

OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...