Tollywood Heroes Businesses: సినిమాల్లో నటించే హీరోలకు మరియు హీరోయిన్లకు రెమ్యూనరేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మన అందరిలోకీ తెలిసిందే..సినీ రంగం లో క్లిక్ అయితే ఆ భోగమే వేరు..కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్ ద్వారా కోట్ల రూపాయిలను మూటగట్టుకుంటున్నారు..అక్కినేని నాగేశ్వర రావు గారి నుండి ఈ ట్రెండ్ మొదలైంది..ఒకపక్క అగ్ర కథానాయకుడిగా ఇండస్ట్రీ లో కొనసాగుతూ మరో పక్క అన్నపూర్ణ స్టూడియోస్ ని నిర్మించి చెన్నై నుండి ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ కి మారిపొయ్యెలా చేసాడు..సినిమాల్లో ఆయన ఎంత సంపాదించాడో తెలీదు కానీ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా మాత్రం ఆరోజుల్లోనే కోట్ల రూపాయిలు సంపాదించాడు..ఆయనని చూసి సూపర్ స్టార్ కృష్ణ కూడా పద్మాలయ స్టూడియోస్ ని నిర్మించాడు..ఇది ఇలా ఉండగా చిరంజీవి తరం నుండి నేటి వరకు స్టార్ హీరోల వరకు ఎవరెవరికి ఏ వ్యాపారాలు ఉన్నాయో ఒక్కసారి ఈ ఆర్టికల్ లో చూద్దాము.

చిరంజీవి :
మెగాస్టార్ గా ఇండస్ట్రీ లో నెంబర్ 1 హీరో గా కొనసాగిన చిరంజీవి తన మిత్రుడు నాగార్జున తో కలిసి స్టార్ మా ఛానల్ ని కొద్దీ రోజులు నడిపారు..కానీ ఆ తర్వాత నష్టాలు వాటిల్లడం తో ఆ ఛానల్ ని సోనీ కంపెనీ వాళ్లకు అమ్మేసారు..ఇక ఆ తర్వాత చిరంజీవి ఎలాంటి ప్రత్యేకమైన వ్యాపారాల్లోనూ తలదూర్చలేదు కానీ కమర్షియల్ యాడ్స్ లో మాత్రం నటించేవాడు.

బాలకృష్ణ :
మాస్ హీరో గా ఇండస్ట్రీ లో కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే నందమూరి బాలకృష్ణ, ప్రత్యేకంగా వ్యాపారాల్లో అడుగుపెట్టలేదు కానీ, తన తల్లి బసవతారకం పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ ని ఏర్పాటు చేసాడు..ఇది కమర్షియల్ హాస్పిటల్ అయ్యినప్పటికీ కూడా పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాడు.

నాగార్జున :
అగ్ర హీరో గా సుమారు నాలుగు దశాబ్దాలు కొనసాగి ఒక్కో సినిమాకి 5 నుండి 6 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే నాగార్జున కి హైదరాబాద్ లో ఉన్నన్ని వ్యాపారాలు ఇండియా లో ఏ హీరో కి కూడా లేవు అని అంటూ ఉంటారు..హైటెక్ సిటీ లో ఉండే కమర్షియల్ బిల్డింగ్స్ అన్నీ నాగార్జునవే అని అందరికీ తెలిసిన విషయమే..అంతే కాదు అన్నపూర్ణ స్టూడియోస్ ని విజయవంతంగా నడుపుతూ లెక్కలేనంత సంపాదన ని ఆర్జిస్తున్నాడు నాగార్జున..ఈమధ్యనే ఈయన గోవా లో కూడా పలు బిజినెస్ లు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది..అందుకు సంబంధించిన కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్ లు కూడా నిర్మిస్తున్నాడట.

మహేష్ బాబు :
సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరో అనేది మన అందరికీ తెలిసిందే..ఒక్కో సినిమాకి 60 కోట్ల రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయి ఆయనది..అలాంటి మహేష్ కూడా ఈమధ్య వ్యాపార రంగం లోకి అడుగుపెట్టాడు..ఆసియన్ ఫిలిమ్స్ తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతం లో ‘AMB సినిమాస్’ ని స్థాపించాడు..హైదరాబాద్ లో ఈ మల్టిప్లెక్స్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు..చెత్త సినిమాలకు కూడా కనీస స్థాయి వసూళ్లు వస్తాయి ఇక్కడ..ఆ రేంజ్ టెక్నాలజీ తో నిర్మించారు..అది గ్రాండ్ సక్సెస్ అయ్యేలోపు మహేష్ బాబు ఒక రెస్టారంట్ ని కూడా ప్రారంభించాడు..ఇది కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది..ఒక పక్క సినిమాలు మరో పక్క బిజినెస్ లు మరో పక్క కమర్షియల్ యాడ్స్..ఇన్ని విధాలుగా మహేష్ బాబు లాభాల్ని ఆర్జిస్తున్నాడు.

విజయ్ దేవరకొండ :
ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే సూపర్ హిట్స్ ని అందుకొని స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన విజయ్ దేవరకొండ కొంత కూడా ఒక్కో సినిమాకు 15 నుండి 20 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు..కానీ ఆయనకీ అది సరిపోవట్లేదు అనుకుంట..అందుకే ‘రౌడీ వేర్’ అని ఒక ఆన్లైన్ యాప్ ని క్రియేట్ చేసి టీ షర్ట్స్ దగ్గర నుండి అన్ని రకాలా రౌడీ వేర్ దుస్తులను అమ్ముతున్నాడు..దీనితో పాటు కొంతకాలం క్రితమే ఈయన మహబూబ్ నగర్ లో AVD సినిమాస్ అనే మల్టిప్లెక్స్ ని స్థాపించాడు..అతి తక్కువ సమయం లోనే ఈ మల్టిప్లెక్స్ బాగా పాపులర్ అయ్యింది.

రామ్ చరణ్ :
రామ్ చరణ్ కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే కాదు..ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ హీరో కూడా..ప్రస్తుతం ఒక్కో సినిమాకి ఆయన 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటాడు..అయితే ఆయన ఈ స్థాయికి ఎదిగే ముందు పలు వ్యాపారాలు ప్రారంభించాడు..తనకి మొదటి నుండి హార్స్ రేస్ అంటే బాగా ఇష్టం..దాని మీద ఉన్న ఆసక్తి తోనే ఒక పోలో టీం ని కొనుగోలు చేసాడు..అంతే కాదు ట్రూ జెట్ అని ఒక ఎయిర్వేస్ కూడా స్థాపించాడు.

అల్లు అర్జున్ :
పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ స్టేటస్ ని అందుకున్న అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం ఒక్కో సినిమాకి వంద కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు..నిన్న మొన్నటి వరకు ఆయనకి ఎలాంటి వ్యాపారాలు లేవు కానీ, ఈమధ్యనే అల్లు అర్జున్ హైదరాబాద్ లో అల్లు స్టూడియోస్ ని ప్రారంభించాడు..ఇందులో ఆయన కూడా ఒక పార్టనర్..అంతే కాదు అమీర్ పెట్ లో సత్యం థియేటర్ బదులుగా అల్లు అర్జున్ కి సంబంధించిన మల్టిప్లెక్స్ రాబోతుంది..దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అయిపోయాయి..అతి త్వరలోనే లాంచింగ్ ఉండబోతుంది.

నాగ చైతన్య :
అక్కినేని నాగార్జున కుమారుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన నాగ చైతన్య తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పరచుకున్నాడు..ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఆయన పది కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటాడు..నిన్న మొన్నటి వరకు ఎలాంటి వ్యాపారాల్లో తలదూర్చని నాగ చైతన్య ఈమధ్యనే ‘షోయూ’ అనే రెస్టారంట్ ని ప్రారంభించాడు..ఇది ఇప్పుడు హైదరాబాద్ లో బాగా ఫేమస్.
